PAN Card
PAN Card

PAN Card :మీ పాన్ కార్డ్ స్టేటస్ ఇలా తెలుసుకోండి!

PAN Card :ఈ కాలంలో పాన్ కార్డ్ అవసరమే కాదు, తప్పనిసరిగా ఉండాలి. పన్నుల చెల్లింపుల నుండి బ్యాంకు లావాదేవీల వరకు పాన్ కార్డ్ అవసరం కీలకం. అయితే మీ వద్ద ఉన్న పాన్ కార్డ్ చురుకుగా ఉందో లేదో తెలుసుకోవాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే, డీయాక్టివేట్ అయిన పాన్ కార్డ్‌తో లావాదేవీలు చేయడం అసాధ్యం. కాబట్టి మీ పాన్ పని చేస్తున్నదా లేదా వెంటనే తెలుసుకోవాలి.

పాన్ (స్థిర ఖాతా సంఖ్య) అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పదిహేను అక్షరాల కలయిక. ఇది సాధారణంగా ప్లాస్టిక్ కార్డ్ రూపంలో వస్తుంది. ప్రభుత్వ అనుమతితో జరగే ఆర్థిక క్రియాశీలతలకు ఇది గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తికి ఒక్క పాన్ కార్డ్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రెండో పాన్ ఉండటం నిబంధనలకు విరుద్ధం. అలాంటి సందర్భాల్లో పాన్ కార్డును రద్దు చేస్తారు.

పాన్ అవసరమైన ప్రాధాన్యత

  • బ్యాంకు ఖాతా ప్రారంభించడానికి
  • పెట్టుబడుల కోసం
  • ఆస్తుల కొనుగోలు
  • రుణాల కోసం దరఖాస్తు
  • ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికీ

TDS లావాదేవీల్లో

  • పాన్ స్టేటస్ తెలుసుకోవడానికీ మార్గం
  • మీ పాన్ కార్డు యాక్టివ్ గా ఉందో లేదో తెలుసుకోవడానికి ‘Verify Your PAN’ అనే సర్వీస్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీనికి ఎలాంటి లాగిన్ అవసరం ఉండదు.

దశల వారీగా ప్రక్రియ:

  • ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కు వెళ్ళండి
  • హోమ్ పేజీలో ‘Verify Your PAN’ లింక్‌ను ఎంచుకోండి
  • పాన్ నంబర్, పేరు, పుట్టిన తేది, మొబైల్ నంబర్ నమోదు చేసి ‘Continue’ క్లిక్ చేయండి
  • మీ మొబైల్‌కు వచ్చిన ఆరు అంకెల ఓటీపీని నమోదు చేసి వ్యాలిడిటీ’Validate)పైన క్లిక్ చేయాలి
  • ధృవీకరణ పూర్తయ్యాక పాన్ స్థితి స్క్రీన్‌పై కనిపిస్తుంది

గుర్తుంచుకోవలసిన విషయాలు:

  • OTP 15 నిమిషాల పాటు మాత్రమే చెల్లుబాటు
  • సరైన OTP నమోదు చేయడానికి మూడు అవకాశాలు ఉంటాయి
  • టైమర్ ద్వారా OTP గడువు చూపిస్తారు
  • OTP రాకపోతే ‘Resend OTP’ క్లిక్ చేయండి

ఈ-పాన్ డౌన్‌లోడ్ విధానం
ఈ-పాన్ అనేది డిజిటల్ రూపంలోని పాన్ కార్డ్. ఇది PDF రూపంలో లభిస్తుంది. ఆధార్(aadhar) ఆధారిత(based) ఈ-కేవైసీ(e-KY)C ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే జారీ అవుతుంది. డిజిటల్ సంతకం ఉన్న ఈ పాన్‌ను ప్రత్యేకంగా ప్రింట్ చేయించుకొని వినియోగించుకోవవచ్చు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *