Rafting : ఉత్తరాఖండ్ రిషికేశ్‌లో జరిగిన రాఫ్టింగ్ ప్రమాదంలో డెహ్రాడూన్‌కు చెందిన యువకుడు సాగర్ నేగి ప్రాణాలు కోల్పోయాడు. రాఫ్టింగ్ చేస్తున్న సమయంలో నదిలో పడిపోయిన అతడిని గైడ్‌లు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఘటన తర్వాత రాఫ్టింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరోసారి చర్చ మొదలైంది. నిబంధనలు పాటించకపోతే రాఫ్టింగ్ ప్రమాదంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందనే సంగతి ఈ ఘటన ద్వారా వెల్లడైంది.
రాఫ్టింగ్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన సూచనలు:
- రాఫ్టింగ్ ప్రారంభించే ముందు గైడ్ ఇచ్చే సూచనలను జాగ్రత్తగా వినాలి, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి.
- లైఫ్ జాకెట్, హెల్మెట్ వంటివి తప్పనిసరిగా ధరించాలి. ఇవే ప్రమాద సమయంలో రక్షణ కల్పించగలవు.
- నది ప్రవాహం బలంగా ఉండే ప్రాంతాల్లో భయపడకుండా గైడ్ చెప్పిన విధంగా వ్యవహరించాలి.
- తెడ్డును గైడ్ సూచించిన దిశలోనే వేయాలి. తప్పుదిశగా వేయడం వల్ల పడవ స్ధిరంగా ఉండదు.
- నీటిలో పడిపోతే తలపై ఉంచుకొని, పాదాలను ప్రవాహానికి వ్యతిరేకంగా ఉంచాలి.
- విలువైన వస్తువులను రాఫ్టింగ్‌కు తీసుకెళ్లకూడదు.
- ముందుగా రాఫ్టింగ్ చేసిన అనుభవం లేకపోతే, అనుభవజ్ఞుడైన గైడ్‌తోనే ప్రయాణించాలి.
- నమ్మకమైన సంస్థల ద్వారా మాత్రమే రాఫ్టింగ్‌కు వెళ్లాలి.
- రాఫ్టింగ్‌కు ముందు సరైన బీమా తీసుకోవడం మంచిది.
రాఫ్టింగ్ అనేది సాహసక్రీడ అయినప్పటికీ, కొద్దిగా జాగ్రత్తతో ఆ ముచ్చటను సురక్షితంగా ఆస్వాదించవచ్చు. ఒకసారి తప్పు జరిగితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందన్న సంగతిని ఎప్పుడూ మరిచిపోవద్దు.