Savings account limit
Savings account limit

Savings Accouunts Limit: సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బు ఉంచవచ్చు?

నగదు డిపాజిట్ పరిమితి ఎంత?

Savings Accouunts Limit: ప్రతి ఒక్కరికి బ్యాంకులో సేవింగ్స్ ఖాతా అనేది అవసరమైపోయింది. ఈ డిజిటల్ యుగంలో నగదు లావాదేవీలకంటే ఆన్‌లైన్ చెల్లింపులే ఎక్కువ. చాలామంది సేవింగ్స్ ఖాతాల నుంచే డబ్బులను చెల్లిస్తున్నారు. అయితే సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత మొత్తంలో డబ్బు నిల్వ చేయొచ్చు? ఎంత వరకూ నగదు జమ చేయొచ్చు? అనే ప్రశ్నలు చాలా మందికి స్పష్టంగా తెలియవు.

సాధారణ సేవింగ్స్ ఖాతాల్లో నిల్వకు ఎలాంటి గరిష్ఠ పరిమితి ఉండదు. మీరు ఎన్ని లక్షలు కావాలంటే అంత వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఆ మొత్తానికి సరైన మూలాలు ఉండాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న ఆధారాలు ఉంటే ఇబ్బంది ఉండదు. అవసరమైతే వాటిని ఆదాయపు పన్ను శాఖకు చూపించాల్సి వస్తుంది.

అయితే కొన్ని ప్రత్యేక సేవింగ్స్ ఖాతాలకు మాత్రం పరిమితులు ఉండొచ్చు. ఉదాహరణకు ఎస్బీఐ మైనర్ ఖాతాలో రూ. 10 లక్షలు వరకు మాత్రమే ఉంచవచ్చు. అలాగే ‘స్మాల్ అకౌంట్లలో’ రూ. 50,000 పరిమితి ఉంటుంది.

  • గుర్తుంచుకోవలసిన అంశాలు:
    ఒక్కసారి 50 వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే పాన్ కార్డ్ వివరాలు తప్పనిసరిగా బ్యాంకుకు ఇవ్వాలి.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ ఖాతాలో నగదు డిపాజిట్లు రూ. 10 లక్షలు దాటితే బ్యాంకు ఈ సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి.
  • ఆ మొత్తానికి సరైన ఆధారాలు లేకుంటే పన్నుతో పాటు జరిమానాలు విధించే అవకాశముంది.
  • కొన్ని బ్యాంకులు రోజువారీ నగదు డిపాజిట్లకు పరిమితులు విధించవచ్చు — ఇవి సాధారణంగా రూ. 1 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు ఉండొచ్చు.
  • తరచుగా పెద్ద మొత్తాల్లో డిపాజిట్లు చేస్తుంటే బ్యాంకులు లేదా ఆదాయపు పన్ను శాఖ అనుమానం వ్యక్తం చేయవచ్చు. అందుకే ఏ డిపాజిట్ అయినా సరైన ఆధారాలతో ఉండాలి.
  • మీ స్వంత ఖాతాలో మీరు ఎన్ని డిపాజిట్లు చేసినా చెల్లుబాటు అవుతుంది. అయితే ఇతరుల తరపున డిపాజిట్ చేసే సందర్భాల్లో కొన్ని బ్యాంకులు రోజుకి రూ. 25,000 వరకే అనుమతించవచ్చు.

తుది మాట
సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉంచడంలో గరిష్ఠ పరిమితులు లేకపోయినా, మీ లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉండాలి. ఎక్కువ మొత్తంలో నగదు జమ చేస్తే ఆధారాలు అవసరం. బ్యాంకు విధానాలు మారుతూ ఉంటాయి కనుక, ఏదైనా అనుమానం వచ్చినప్పుడు మీ బ్యాంకును సంప్రదించడం మంచిది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *