Congress Rally: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహా ప్రతిష్టాపన చేసిన సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు పట్టణంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమై బెల్లంపల్లి చౌరస్తా, రైల్వే స్టేషన్ రోడ్డు, మార్కెట్, ముకరం చౌరస్తా, ఓవర్ బ్రిడ్జ్ మీదుగా మంచిర్యాల ఐబీ చౌరస్తా వరకు సాగింది.
ఈ సందర్భంగా దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి,నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ల వేణు, రాష్ట్ర నాయకుడు చిట్ల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల