Donation : ఇటీవల బెల్లంపల్లి కన్నాల బస్తీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూతురును, తల్లిని కోల్పోయిన పారామెడికల్ ఆప్తల్మిక్ అసిస్టెంట్ టింకరి అలేఖ్యకు జిల్లా కంటి వెలుగు ఆప్టోమెట్రిస్ట్, ఆప్తాలమిక్ అసిస్టెంట్ అసోసియేషన్ నాయకులు రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆప్తల్మిక్ విభాగం ఇంఛార్జీ డాక్టర్ శంకర్, జిల్లా అధ్యక్షుడు బుడిపాటి రాజశేఖర్, కమిటీ సభ్యులు ఇస్లవత్ రాజేష్, కొంకటి అంజయ్య, పల్లేర్ల సంతోష్, డీ పరమేశ్వరి, జ్యోతి, లేఖ తదితరులు పాల్గొన్నారు.
– మంచిర్యాల, శెనార్తి మీడియా