Geetha Jayanthi : మంచిర్యాల పట్టణంలోని రాంనగర్‌లో శ్రీ భగవద్గీత అధ్యయన మండలి ఆధ్వర్యంలో గీతాజయంతి ఉత్సవాల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 10 నుంచి12 వరకు పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం 1.50 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు బహ్మశ్రీ డాక్టర్ ఎల్వీ గంగాధర శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత అధ్యయన మండలి అధ్యక్షుడు గోనె శ్యామ్ సుందర్ రావు, కమిటీ సభ్యులు ఎం. సత్యనారాయణ, డాక్టర్ కుండి కృష్ణ, కటుకం హరీష్, ద్రాక్షపల్లి చంద్రశేఖర్, డాక్టర్ కే సుగుణాకర్ రెడ్డి, డాక్టర్ జీ బద్రినారాయణ, మల్లా రెడ్డి, సత్యసాయి సంస్థ, వికాస తరంగిణి(జెట్), ఆర్ఎస్ఎస్, లలిత సేవా సమితి, ఇతర సంఘాల సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల