మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
Prajavaani :ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వి.రాములు, హరికృష్ణలతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన సంకె మల్లయ్య తనకు గ్రామ శివారులో గల భూమికి సంబంధించి నూతన పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. హాజీపూర్ మండలం గుల్లకోట గ్రామానికి చెందిన జి. మల్లేష్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో తాను కోల్పోయిన భూమికి సంబంధించి నష్టపరిహారం అందించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన మేడి శ్రీనివాస్ తాము కన్నాల శివారులో భూమిని కొనుగోలు చేశామని, ఇట్టి వివరాలు ధరణిలో నమోదు చేసి పాస్ పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన తోట లక్ష్మయ్య తనకు గ్రామ శివారులో ఉన్న భూమి ధరణిలో కనిపించడం లేదని, ఈ విషయమై న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన నల్లపు ఊషన్న తన తండ్రి పేరిట గ్రామ శివారులో గల భూమి ధరణిలో కనిపించడం లేదని, ఆయన మరణించినందున తన పేరిట మార్పిడి చేసి ధరణిలో నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అధికారుల సమన్వయంతో పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల :