Sucide Attempt : రుణమాఫీ కాలేదని కవ్వాల్ గ్రామానికి చెందిన జక్కుల లచ్చన్న అనే వ్యక్తి శనివారం ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డ సంఘటన మండలంలోని కవ్వాల గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం ప్రభుత్వం ప్రకటించిన మూడో విడత రెండు లక్షల రుణమాఫీ లిస్టులో తన పేరు రాలేదని ఆ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడే ఉన్న మరో రైతు తొందరగా వచ్చి లచ్చన్న చేతిలోని పురుగుల మందు డబ్బాను లాక్కొని బయటపడేశారు. ఈ విషయమై ఎఈఓ అక్రమంను సంప్రదించగా తమకున్న సమాచారం మేరకు జక్కు లచ్చన్నకు 2.9 లక్షల వరకు బ్యాంకు రుణం ఉందని ప్రభుత్వం రెండు లక్షలు వరకు మాత్రమే మాఫి చేసిందని ఈ విషయం ఆ రైతుకు తెలియదని తెలిపారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల :