Best Teahcer : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు ఉన్నత పాఠశాలలోని గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు తాళ్లపెళ్లి రాకేష్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్, డీఈవో ప్రణిత తో పాటు అధికారులు ఆయనను సన్మానించి, ప్రశంసా పత్రం అందజేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన రాకేష్‌ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
శెనార్తి మీడియా, తలమడుగు