bjp flgas
bjp flgas

BJP MLC Poll: పట్టు నిలబెట్టుకునేందుకు బీజేపీ యత్నం

  • ఎమ్మెల్సీ టికెట్ కోసం కాషాయ పార్టీలో తీవ్ర పోటీ
  • నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి మొగ్గుచూపుతున్న ఆశావహులు, హైకమాండ్ సమాలోచనలు
  • ఆదిలాబాద్ జిల్లా నుంచి వినిపిస్తున్న గటిక క్రాంతి కుమార్ పేరు

BJP MLC Poll: నాలుగు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఇప్పటికే ఓటరు నమోదు కార్యక్రమం పూర్తి అవడంతో అభ్యర్థులు ఎవరనేదానిపై ఆయా పార్టీలు చర్చిస్తున్నాయి. అయితే బీజేపీలో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధి లోని కరీంనగర్ పార్లమెంట్ నుండి గతంలో రెండుమార్లు పోటీ చేసిన బీజేపీ సీనియర్ నాయకులు సుగుణాకర్ రావు గారు మరోసారి టికెట్ ఆశిస్తూ అధిష్టాన పెద్దలను కలిసి తనకి మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కానీ దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులందరితో పాటు ఇండిపెండెంట్ గా పోటీచేసే యోచనలో ఉన్న వారందరూ కూడా కరీంనగర్ కి చెందిన వారే కావడం ఆయనకి ప్రతికూలంగా మారింది.

మరోవైపు పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుండి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘనాథ్ కూడా బలంగా టికెట్ వేటలో ఉన్నాడు. ఆర్థికంగా బలమైన నేపథ్యం, ఎమ్మెల్యేగా పోటీచేసి మంచి ఓట్లు సాధించడం కలిసి వచ్చే అంశాలు కాగా పెద్దపల్లి పార్లమెంటు పరిధి లో ఏ అసెంబ్లీలో కూడా బీజేపీకి సంస్థాగతంగా అసలే బలం లేకపోడం అక్కడ కాంగ్రెస్ బలంగా ఉండటం, మరోవైపు ఆయనకి పార్లమెంట్ పరిధి లోని కార్యకర్తలు నాయకులతో సఖ్యత లేకపోవడం, వారందరూ బహిరంగంగానే ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుండడం ఆయనకి ప్రతికూలాంశాలుగా చెప్పవచ్చు.

అయితే మెదక్ పార్లమెంట్ నుంచి టికెట్ ఆశిస్తున్న అంజిరెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేత. ప్రస్తుతం ఆయన భార్య సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు.  అంజిరెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్నాడు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో భవిష్యత్తులో అండగా ఉంటామని పార్టీ హామీ ఇవ్వడంతో ఇప్పుడు టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం.

ఆదిలాబాద్ జిల్లా నుంచి గటిక క్రాంతి కుమార్ ఇప్పటికే తన ఆశాభావాన్ని పార్టీ పెద్దల ముందు ఉంచినట్టు సమాచారం. ఆదిలాబాద్ పార్లమెంటులో బీజేపీకి నలుగురు

ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉండటం ప్లస్ పాయింట్. అలాగే మరో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా బీజేపీ సంస్థాగత బలాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు. అక్కడి బాజపా నుండి గటిక క్రాంతి కుమార్ తప్ప మరే ఇతర పార్టీల నుండి ఎవరూ అభ్యర్తిత్వాన్ని ఆశించకపోవడం, పార్లమెంట్ సెగ్మెంట్ లోని దాదాపు అన్ని పార్టీల ప్రథమ శ్రేణి నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులందరితో మంచి సంబధాలు కలిగి ఉండడం ఆయనకి కలిసి వచ్చే అంశం. అలాగే శ్రీ సరస్వతీ శిశుమందిర్ పూర్వ విద్యార్థి కావడమే కాకుండా, ఆ ప్రాంత పూర్వ విద్యార్థి పరిషత్ నాయకునిగా కొనసాగుతూ రాష్ట్ర స్థాయి పూర్వ విద్యార్థి నాయకులందరతో పూర్వాచార్యులందరితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ప్రారంభమైన తన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ యువమోర్చా రాష్ట్ర నాయకుడిగా చేసి ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడిగా పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నాడు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలంగా ఉండటం, అలాగే క్రాంతి కుమార్ కూడా వ్యక్తిగతంగా శిశు మందిర్ పూర్వ విద్యార్థులతో పాటు స్థానికంగా అన్ని సంఘాలతో మంచి సత్సంబాలు కలిగి ఉన్నాడు. ఆర్థికంగా బలంగా లేక పోవడం అనేది ఈయనకు ప్రతికూలాంశం.

– శెనార్తి మీడియా, ఆదిలాబాద్

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *