Hydra in Mancherial
Hydra in Mancherial :

Hydra in Mancherial : మంచిర్యాలలో హైడ్రా కలకలం

బీఆర్ఎస్ లీడర్ కు చెందిన భవనం కూల్చివేత
అనుమతి ఒక చోట.. నిర్మాణం మరో చోట చేపట్టారంటున్న మున్సిపల్ అధికారులు
భారీగా పోలీసుల మోహరింపు
డీకొండ అన్నయ్య ముందస్తు అరెస్ట్

Hydra in Mancherial : హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలకూ హైడ్రాను విస్తరింపజేయాలని సామాన్యులతో పాటు అధికార పక్షనేతలు, బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మాదిరిగానే మంచిర్యాలకు హైడ్రా చేరింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నస్పూర్ మున్సిపాలిటీలోని 42 సర్వే నెంబర్ లో బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్య అక్రమంగా ఐదంతస్తుల బిల్డింగ్ నిర్మించారని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ బిల్డింగ్ ను పోలీసుల సహాయంతో మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇంటి యజమానిని ముందస్తు చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి బంధువులు ఇంటి వద్దకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.
ముందస్తు నోటీసులు ఇచ్చాం.

munciapl commisioner sathish

నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్
భవన నిర్మాణానికి సర్వే నంబర్ 40 లో అనుమతులు సర్వే నంబర్ 42 లో చేపట్టారని నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ తెలిపారు. ఈ విషయమై 2022 నుంచి నోటీసులు ఇస్తున్నా డీకొండ అన్నయ్య పట్టించుకోలేదన్నారు. 15 రోజుల క్రితం సైతం నోటీసులు జరి చేశామని చెప్పారు. పోలీస్ అధికారుల సహాయంతో ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నామని స్పష్టం చేశారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *