Kaidi-2 Upadate
Kaidi-2 Upadate

Kaidi-2 Update : కార్తీ ఖైదీ-2 లో రోలెక్స్ కీ రోల్?

Kaidi-2 Update : తమిళ సినిమా సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాస్టర్ పీస్ ఖైదీ-2 షూటింగ్, నటీనటుల గురించి తమిళనాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. త్వరలో ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తున్నది. కార్తీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. చాలా ఏళ్ల తర్వాత కార్తీకి ఖైదీతో హిట్ వచ్చింది. ఒక్క రోజులో జరిగే ఈ కథతో తీసిని ఈ చిత్రానికి తమిళంతో పాటు తెలుగులోనూ అంతే ఆదరణ పొందింది.

కాగా, లోకేష్ కనగరాజ్ ఖైదీ సినిమాలోని కొన్ని పాత్రలను కమల్ హాసన్ విక్రమ్‌ సినిమాలోనూ చేర్చారు. అందుకే తమిళ సినిమాలో లొకేష్ చిత్రాలను ఎల్‌సీయూ అంటుంటారు. ఖైదీ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి కోలీవుడ్ నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. ఖైదీ రెండో భాగం షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రారంభం కానుందని సమాచారం. 50 రోజుల్లోగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోందని, అందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిందని సమాచారం.

అంతేకాదు ఈ చిత్రంలో రోలెక్స్‌ క్యారెక్టర్ కూడా ఉంటుందని సమాచారం. ఇదే జరిగితే సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం. ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కుతున్న కంగువ సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో హీరో కార్తీ అతిథి పాత్రలో నటించాడని సమాచారం. ఇక వీరిద్దరి కలయికలో ఖైదీ సినిమా రూపొందితే అన్నదమ్ముళ్లు ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే అవుతుందని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *