sand dump in seetharampalli
sand dump in seetharampalli

Sand Storage : సీతారాంపల్లిలో.. ఊరంతా ఇసుకడంపులే

  • అధికారులు పట్టుకున్నది కేవలం 135 ట్రిప్పులే..
  • గ్రామం నడిబొడ్డున వందలాదిగా ఇసుక నిల్వలు

Sand Storage : నస్పూర్ కలెక్టరేట్ కి సమీపంలోఉన్న సీతారాంపల్లి గ్రామంలో ఊరంతా ఇుక డంపులే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కుప్పలు కుప్పలుగా వందలాదిగా ఇసుక కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఇటీవల రెవెన్యూ అధికారులు తూతు మంత్రంగా ఇసుక డంపులను సీజ్ చేశారు. అయితే అధికారులు మాత్రం కేవలం 135 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపులు మాత్రమే పట్టుకున్నామని, వాటిని సీజ్ చేశామంటూ ఫొటోలకు ఫోజులిచ్చారు. కాని అక్కడ ఉన్నవి మాత్ర వేలాది ట్రిప్పుల ఇసుక కనిపిస్తున్నది. అధికారులు కేవలం135 ట్రిప్పులు పట్టకున్నామని స్వయంగా రెవెన్యూ, మైనింగ్ అధికారులు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికైనా బాధ్యతగల సంబంధిత అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా, ప్రలోభాలకు ఆశపడకుండా విధులు నిర్వహిస్తే మరిన్ని అక్రమ డంపులు బయట పడతాయని పలువురు చర్చించుకుంటున్నారు.

సీతారాంపల్లి గ్రామంలో ఇసుక నిల్వలు

సీతారంపల్లిలో నిల్వ చేసిన ఇసుక డంప్
సీతారంపల్లిలో నిల్వ చేసిన ఇసుక డంప్

నడిబొడ్డున నిల్వలు
ఇసుక డంప్ లు సీతారాంపల్లి, తాళ్లపల్లి గ్రామ శివారులోనే కాకుండా గ్రామ నడిబొడ్డున దర్శనమిస్తున్నాయి. దాదాపు ఇంటింటికీ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ఇసుక కుప్పలు చూస్తుంటే ఎన్ని వేల ట్రిప్పు ఇసుక అక్రంగా నిల్వ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కొందరేమో తహసీల్దార్ అనుమతులు తెచ్చుకున్నామంటుండగా, వాటిని ఏ ప్రాతిపదికన సక్రమం చేశారో సంబంధిత శాఖ అధికారులకే తెలియాలి. ఇలా వందల ట్రిప్పుల ఇసుక ఇండ్ల చుట్టూ డంప్ చేసి కనిపిస్తున్నాయి. మరి ఇంత పెద్ద మొత్తంలో ఇసుక నిల్వ చేసేందుకు అధికారులు ఏ ప్రాతిపదికన అనుమతిచ్చారో వారికే తెలియాలి.

సీతారాంపల్లి గ్రామంలో ఇసుక నిల్వలు

సీతారంపల్లిలో నిల్వ చేసిన ఇసుక డంప్
సీతారంపల్లిలో నిల్వ చేసిన ఇసుక డంప్

శెనార్తి మీడియా, మంచిర్యాల :

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *