Digtala Arrest
Digtala Arrest

Digital Arrest: ఇంజినీరింగ్ విద్యార్థిని డిజిటల్ అరెస్టు

  • నాగాలాండ్ యువతికి యూపీ నకిలీ పోలీస్ బెదిరింపులు
  • న్యూడ్ వీడియో తీసి రూ. లక్ష ఇవ్వాంటూ డిమాండ్
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

Digital Arrest: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో డిజిటల్ అరెస్ట్‌కు సంబంధించిన షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ఇంజినీరింగ్ విద్యార్థినికి తాను బ్యాంకు అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మా బ్యాంకు నుంచి నువ్వు అప్పు తీసుకున్నావు.. తిరిగి చెల్లించలేదు. నీ పై కేసు నమోదు చేశామంటూ బెదిరించాడు. ఆ తర్వాత మరో వ్యక్తి పోలీస్ డ్రెస్ లో వీడియో కాల్ చేసి మరింత బెదిరింపులకు గురి చేశాడు. తక్షణమే హైదరాబాద్ వచ్చి బెయిల్ తీసుకోవాలని, ముందుగా ఆన్‌లైన్‌లో బెయిల్ కోసం డబ్బు పంపాలని హుకూం జారీ చేశాడు. అంతటితో ఆగకుండా ఛాతీపై పచ్చబొట్టుతో సహా మొత్తం శరీరాన్ని చూపించాలని, అప్పుడు తాము గుర్తిస్తామని చెప్పాడు. వీడియో తీసిన తర్వాత సదరు వ్యక్తి విద్యార్థినిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఆమె నుంచి రూ.38 వేలు బలవంతంగా వసూలు చేశాడు. అనంతరం మరో లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

నాగాలాండ్‌లోని దిమాపూర్‌ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని గోరఖ్‌పూర్‌లోని మదన్‌ మోహన్‌ మాలవ్య కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నది. ఆదివారం ఉదయం 11:30 గంటల సమయంలో ఓ వ్యక్తి ఆమె మొబైల్ ఫోన్‌కు కాల్ చేశాడు. తాను ఎస్ బీఐ బ్యాంకు అధికారినని చెప్పాడ. నువ్వ మా బ్యాంకులో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని, దీంతో కేసు నమోదు చేశామని బెదిరించాడు. అసలు మొత్తం, రూ.లక్ష వడ్డీని వెంటనే చెల్లించాలని లేకుంటే అరెస్ట్ తప్పవదని హెచ్చరించి కాల్ కట్ చేశాడు. కొద్దిసేపటికి సదరు విద్యార్థినికి వాట్సాప్ కాల్ చేశాడు. పోలీస్ డ్రెస్ లో ఉన్న సదరు వ్యక్తి నీపై హైదరాబాద్‌లో ఎఫ్‌ఐఆర్‌ కేసు నమోదైందని, బెయిల్ తీసుకోవాలన్నాడు. వీలైనంత త్వరగా ఇక్కడికి వచ్చి బెయిల్ తెచ్చుకోవాలని, లేకపోతే కస్టడీలోకి తీసకుంటామని హెచ్చరించాడు. అయితే తాను ఎటువంటి రుణం తీసుకోలేదని, కేసు ఎలా నమోదు చేశారంటూ ప్రశ్నించింది. అయితే అరెస్టయ్యాక నిజాలు తెలుస్తాయంటూ సదరు నకిలీ పోలీస్ మరింత బెదిరింపులకు గురి చేశాడు.

టాటూ చూపించాలని డిమాండ్

దీంతో సదరు విద్యార్థిని భయాందోళనకు గురైంది. ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్లడం కష్టమని భావించిన బాధితురాలు సదరు వ్యక్తికి రూ. 38వేలు ట్రాన్స్ ఫర్ చేసింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఒంటి మీద పుట్టు మచ్చలు చూపించాలని, లేకుంటే ఐటెంటిఫై చేయడం కష్టమని చెప్పాడు. అంతా నిజమేనని అనుకున్న విద్యార్థిని తన బట్టలు విప్పేసింది. ఆ తర్వాత ఫోన్‌ డిస్‌కనెక్ట్‌ అయింది. వెంటనే మళ్లీ కాల్ రాగా, సదరు వ్యక్తి నీ న్యూడ్ వీడియో తీశానంటూ బెదిరించాడు. వెంటనే మరో రూ.లక్ష పంపించాలంటూ డిమాండ్ చేశాడు. లేకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన విద్యార్థిని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు గుర్తుతెలియని నంబర్లపై కేసు నమోదు చేశారు. కాల్స్ చేసిన వ్యక్తులను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు. ఆధారాలు, వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు..

డిజిటల్ అరెస్టులు అంటూ బెదిరింపులు
గోరఖ్‌పూర్ లో ఇప్పటి వరకు చాలా మందిని ఇలాగే డిజిటల్ అరెస్ట్ బాధితులుగా మారారు. ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అనే పదం పోలీసు డిక్షనరీలో ఎక్కడా లేదని స్పష్టం చేస్తున్నారు.

సైబర్ నిపుణులు ఏం చెబుతున్నారు ?
డిజిటల్ అరెస్ట్ అనేది మోసానికి కొత్త పద్ధతి అని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నానరి, వారిని బెదిరింపులకు గురి చేస్తూ డబ్బు దోచుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే చర్యలు తీసుకుంటామని వీడియో కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారని వివరిస్తున్నారు.

గతంలోనూ వెలుగులోకి
మే 24న గోరఖ్‌పూర్‌లోని సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఓ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను సైబర్ నేరగాళ్లు డిజిటల్‌ అరెస్ట్‌ చేసి రూ.12.56 లక్షలు దోపిడీ చేశారు. మీర్జాపూర్‌ కు చెందిన ఓ కంపెనీ మేనేజర్‌ ను సీబీఐ అధికారులమంటూ బెదిరించారు. దాదాపు 48 గంటల పాటు డిజిటల్‌ అరెస్ట్‌ చేసి రూ.14,96,000 దోచుకున్నారు.
ఇలాంటి అనేక కేసులు వెలుగులోకి వచ్చినా ప్రజలు మోసాలకు గురవుతూనే ఉన్నారు. ఇప్పటికే పోలీసులు అప్రమత్తమయ్యారు. తాము ఎలాంటి డిజిటల్ అరెస్టులు చేయమని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలి. పార్ట్ లేదా ఫుల్ టైమ్ జాబ్ అంటూ సోషల్ మీడియాలో వచ్చే లింక్స్ ఓపెన్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులకు అందించవద్దని సూచిస్తున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *