Balka Suman: కుంట మత్తడి పేల్చింది కాంగ్రెస్ నాయకులే

  • చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే,  బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్

Balka Suman:  మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీలో శనిగకుంట మత్తడి పేల్చివేతలో కాంగ్రెస్ నాయకుల హస్తమే ఉందని బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. గోదావరిఖని లో ఆదివారం సింగరేణి కార్మికుల లాభాల వాటా 33% కచ్చితంగా ఇవ్వాలని చేసిన రేలా నిరాహార దీక్షలో పాల్గొని అయన మాట్లాడారు.  చెరువును ఆక్రమించి వెంచర్ ఏర్పాటు చేయడానికి చెరువు నీరు అడ్డుగా వస్తుందని కాంగ్రెస్ నాయకులు మరి కొందరి భాగస్వామ్యంతో ఈ యొక్క పేల్చివేత కార్యక్రమం పునుకుందని అన్నారు. ఈ చెరువు పేలుడు పదార్ధాలకు సంబంధించి జిలీ టెన్ స్టిక్స్ బాంబ్ లో ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నిచ్చారు. పోలీసులు ఎలాంటి ప్రలోబాలకు, రాజకీయ నాయకుల ఓతిళ్లకు లొంగకుండా నిజమైన నిందితులను బొక్కలో వేయాలని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాపాడి ఎమ్మెల్యే వివేక్ ఫోన్ చేయగానే వారిని వదిలిపెట్టి అమాయకులైన వారిని జైలుకు పంపించడం అన్యాయమన్నారు. మాకు పోలీస్ వ్యవస్త మీద పూర్తి నమ్మకం ఉందని ఇప్పటికయినా దొషులను శిక్షించి న్యాయాని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే లు కోరుకంటి చందర్, నడిపెల్లి దివాకర్ రావు, పుట్ట మధు, బీఆరెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ రాజా రమేష్, మంచిర్యాల జిల్లా బీఆరెస్ యువ నాయకుడు నడిపెల్లి విజిత్ రావు, తదితరులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *