OTT Movies : థియేటర్లతో పాటు, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. మెజార్టీ సినిమాలు ముందుగా థియేటర్లలో, ఆ తర్వాత ఓటీటీలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో చాలా సినిమాలు హిట్ గా నిలిచాయి. కొన్ని థియేటర్లలో రిలీజైన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలలయ్యాయి. ఓటీటీలో హిందీ సినిమాలకు ఆదరణ లభిస్తున్నది. బాలీవుడ్ సినిమాలకు హాలీవుడ్ చిత్రాలకు పోటీని ఇవ్వడం విశేషం. ఓటీటీలో ఎక్కువగా వీక్షిస్తున్న హిందీ చిత్రాల గురించి తెలుసుకుందాం.
మిస్సింగ్ లేడీస్
ఓటీటీలో టాప్ లో నిలిచిన చిత్రాల్లో ‘మిస్సింగ్ లేడీస్(Missing Ladies)’. మొదటి స్థానంలో ఉంది. రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విపరీతంగా వీక్షిస్తున్నారు. కిరణ్ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నితాన్షి గోయల్, ప్రతిభా రంత, స్పర్ష్ శ్రీవాస్తవ ప్రధాన పాత్రలు పోషించారు. 1.71 కోట్లతో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా నిలిచింది.
షైతాన్
ఇక రెండో స్థానంలో వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ‘షైతాన్'(Shaithan) నిలిచింది. ఇందులో అజయ్ దేవగన్, తమిళ స్టార్ హీరో ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలు పోషించారు. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో ఈ సినిమా ఆదరణ పొందుతున్నది. 1.48 కోట్ల వీక్షణలతో, నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన రెండో చిత్రంగా షైతాన్ నిలిచింది.
క్రూ..
అత్యధికంగా వీక్షిస్తున్న చిత్రాల జాబితాలో ‘క్రూ’ మూడో స్థానంలో ఉంది. కరీనా కపూర్, టబు, కృతి సనన్ నటించారు. బంగారం స్మగ్లింగ్‌లో చిక్కుకున్న ముగ్గురు ఎయిర్ హోస్టెస్‌ల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రం ఇప్పటివరకు 1.43 కోట్ల వీక్షణలను అందుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన హిందీ చిత్రాల జాబితాలో ఇది థర్డ్ ప్లేస్ లో ఉంది.
ఫైటర్
దీపికా పదుకొణె, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఫైటర్'(Fighter) నాలుగో స్థానంలో ఉంది. జనవరి 2024లో విడుదలైన ఈ సినిమా 1.40 కోట్ల వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన నాలుగో చిత్రంగా నిలిచింది.
యానిమల్
2023 డిసెంబర్ లో విడుదలైన ‘యానిమల్'(Animal) నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది. 1.36 కోట్ల వ్యూస్‌తో ఐదో స్థానంలో ఉంది.
డాంకీ
గత ఏడాది స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఈ మూడు చిత్రాలు మంచి వసూళ్ల రాబట్టాయి. ఏడాది చివర్లో విడుదలైన డాంకీ(Dunkey) కూడా నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ చిత్రం 1.08 కోట్ల వ్యూస్ తో ఆరో స్థానంలో నిలిచింది.
భక్షక్
ముజఫర్‌పూర్ షెల్టర్ కేసు ఆధారంగా రూపొందిన క్రైమ్-థ్రిల్లర్ ‘భక్షక్’. నెట్‌ఫ్లిక్స్ లో 1.04 కోట్ల ఏడో స్థానంలో ఉంది.
మర్డర్ ముబారక్
పంకజ్ త్రిపాఠి, కరిష్మా కపూర్, సారా అలీ ఖాన్, విజయ్ వర్మ వంటి భారీ తారాగణంతో రూపొందిన చిత్రం ‘మర్డర్ ముబారక్’. ఈ సినిమా 63 లక్షల వ్యూస్ తో నెట్‌ఫ్లిక్స్‌లో ఎనిమిదో హిందీ చిత్రంగా నిలిచింది.
ఆర్టికల్ 370
యామీ గౌతమ్, ప్రియమణి, స్కంద ఠాకూర్, అశ్విని కౌల్, వైభవ్ తట్వాడి, అరుణ్ గోవిల్ తదితరులు నటించిన చిత్రం ‘ఆర్టికల్ 370’. నెట్‌ఫ్లిక్స్‌లో 58 లక్షల వ్యూస్ తో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
అమర్ సింగ్ చమ్కీలా
దిల్జీత్ దోసాంజ్-పరిణీతి చోప్రా నటించిన చిత్రం ‘అమర్ సింగ్ చమ్కిలా’. ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా 53 లక్షల వ్యూస్ తో నెట్ ఫ్లిక్స్ లో పదో స్థానంలో ఉంది.