Khatron Ke Khiladi Season -14

Khatron Ke Khiladi Season-14: రోహిత్ శెట్టి ఖత్రోంకి కిలాడీ-14 నుంచి మరొకరు ఎలిమినేట్

Khatron Ke Khiladi Season-14: కలర్స్ టీవీ అడ్వెంచర్ రియాల్టీ షో ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ సీజన్ -14లో ఇప్పటివరకు రెండు ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మీడియా కథనాల ప్రకారం, ‘బిగ్ బాస్ సీజన్ -11’ విజేత శిల్పా షిండే రోహిత్ శెట్టి షో నుంచి ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్. అయితే ఈ విషయంలో శిల్పా కానీ, కలర్స్ టీవీ కానీ స్పందించలేదు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పుడు రోహిత్ శెట్టి షోలో మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఎలిమినేట్ అయ్యింది ఓ మహిళా సెలబ్రిటీ అని తెలుస్తుంది.

శిల్పా షిండే తర్వాత, టీవీ నటి అదితి శర్మ ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ నుంచి నిష్క్రమించారని ఓ యూట్యూబ్ ఛానెల్ లో న్యూస్ వచ్చింది. గష్మీర్ మహాజనీ, అభిషేక్ కుమార్, కరణ్వీర్ మెహ్రా, అదితి శర్మల మధ్య జరిగిన ఈ పోటీలో అదితి వెనుకబడిపోయింది. దీంతో షో హోస్ట్ రోహిత్ శెట్టి అదితినిని షో నుంచి తొలగించారు. వాస్తవానికి అదితి ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ కోసం 6 నెలలుగా సిద్ధమవుతోంది. ఈ సీజన్‌లో విజేతగా నిలవాలని ఆమె తల్లిదండ్రులు కోరుకున్నారు. షోలో ఫిట్ గా కనిపించేందుకు అన్నం, చపాతీ తినడం కూడా మానేసింది. కానీ అదితి స్ట్రిక్ట్ డైట్ ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు.

ఎలిమినేషన్ (Elimination) కు కారణమేంటి?

గష్మీర్ మహాజని, అభిషేక్ కుమార్, కరణ్వీర్ మెహ్రా, అదితి శర్మలకు నీటి అడుగున విన్యాసాలు చేసే స్టంట్ అప్పగించాడు రోహిత్ శెట్టి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇచ్చిన టాస్క్‌ల కంటే ఈ టాస్క్ మరింత కఠినం. ఈ నలుగురు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ మాత్రమే ఈ టాస్క్‌ను శ్రద్ధగా పూర్తి చేశారు. అయితే, ఈ సమయానికి సంబంధించిన టాస్క్‌లో ఎక్కువ సమయం తీసుకున్నందున అదితి ఎలిమినేట్ అయింది. అంకితా లోఖండే, విక్కీ జైన్‌ల ‘లాఫ్టర్ చెఫ్’ స్థానంలో రోహిత్ శెట్టి ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ రాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *