అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన
మున్సిపల్ కమిషనర్
Rajanna Sircilla : సెల్ ఫోన్ లైట్ల వెలుగుల్లో అంత్యక్రియలు” శీర్షికన శెనార్తి మీడియా వెబ్ సైట్ లో శనివారం మధ్యాహ్నం ప్రచురితమైన కథనానికి సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్ స్పందించారు. నెహ్రూ నగర్ శ్మశాన వాటికను ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. నిర్లక్ష్యం చూపిన సదరు అధికారులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా విద్యుత్ రిపేర్లతో పాటు మట్టి రోడ్డు మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్ స్పందన పై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. శెనార్తి మీడియా విలేకరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
– శెనార్తి మీడియా, రాజన్న సిరిసిల్ల