Funeral

Funeral :సెల్ ఫోన్ లైట్ల వెలుగుల్లో అంత్యక్రియలు

Funeral : మనిషి చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె పట్టణం అనే తేడా లేకుండా వైకుంఠధామాల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కొందరు అధికారుల నిర్లక్ష్యంతో ఆఖరి మజిలీకి అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ వైకుంఠ గ్రామానికి గత రెండు నెలలుగా విద్యుత్ సరఫరా లేదని స్థానికులు అంటున్నారు. ఎవరైనా చనిపోతే అందాకారంలో ఆఖరి అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ లైట్ల సహాయంతో అంత్యక్రియలు చేసుకుంటున్నామని అంతే కాకుండా మెయిన్ రోడ్ నుండి వైకుంట దామం వరకు రోడ్డు ఎంత బురద మయంగా మారిందని మండిపడుతున్నారు మునిసిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు ఇప్పటికైనా మునిసిపల్ అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ కనెక్షన్ పించి బురదమయంగా మారిన రోడ్డుకు మరమ్మత్తు పనులు నిర్వహించాలని కోరుతున్నారు.

– శెనార్తి మీడియా, రాజన్న సిరిసిల్ల

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *