Kalki-2898-AD movie review
Kalki-2898-AD movie review

Kalki 2898 Ad Review : కల్కి కి హైప్ తెప్పించింది ప్రభాస్.. కానీ సినిమా అంతా మరొకరు..

Kalki 2898 Ad Review : ఇప్పటి దాకా సినిమా కల్కి 2898 AD సినిమాకు హైప్, ప్రమోషన్ అంతా డార్లింగ్ ప్రభాస్ మీదనే నడిచింది. డైరెక్టర్, ప్రొడ్యూసర్లు కూడా ప్రభాస్ నే ముందుంచి నడిపించారు. కానీ సినిమా చూస్తే కానీ అసలు విషయం తెలియదు. సినిమాలో స్టార్ కాస్టింగ్ ఎక్కువైంది. కానీ ఒకరిద్దరు మినహా మిగతా వాళ్లంతా అలా వచ్చి… ఇలా వెళ్లి పోయే వాళ్లే. భైరవ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో దుల్కర్ సల్మాన్, శంభాల టీమ్ బ్యాచ్ లో వచ్చే మృణాళ్ ఠాకూర్, రాజేంద్రప్రసాద్ కొద్దిసేపే కనిపిస్తారు. ఇక సెకండాఫ్లో రాజమౌళి తన నిజజీవితంలో ఎదుర్కొంటున్న విమర్శల నేపథ్యంలో ఓ క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు డైరెక్టర్ అశ్విన్. రాంగోపాల్ వర్మను ఒప్పించం నిజంగా వండరే.. కానీ తన ఒరిజినాలిటీని ఇందులోనూ చూపించారు. తాను బయట ఎలా ఉంటాడో సినిమాలో కనిపించే ఒక్క నిమిషం సీన్ లోనూ అలాగే కనిపించాడు. రాజమౌళి, రాంగోపాల్ వర్మకు స్ర్కీన్ స్పేస్ తక్కువైనా వాళ్లున్నంత సేపు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఆర్జీవీ లాంటి టిపికల్ క్యారెక్టర్ ఈ సినిమా రోల్ చేయడం నిజంగానే షాక్.

బిగ్ బీ దే సినిమా అంతా

కల్కి 2898 AD సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ పై అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. సినిమా మొదలయ్యాక దాదాపు 30 నిమిషాల తర్వాత ప్రభాస్ ఎంటరవుతాడు. ఆ తర్వాత మిగతా కథ నడుస్తుందే తప్ప ప్రభాస్ కనిపించడు. ఇక బిగ్ బీ అమితాబ్ సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకున్నాడు. 75 ఏళ్లకు పైగా ఉన్న అమితాబ్ సినిమా లో మాత్రం తన ఎనర్జీ తో మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం బిగ్ బీనే. సెకండాఫ్ లో ప్రభాస్, అమితాబ్ పై తీసిన ఫైట్ సీక్వెన్స్ ఎక్సాట్రార్డినరీ. ప్రభాస్ లాంటి స్టార్ హీరో.. అమితాబ్ లాంటి లెజెండ్ తో ఫైట్ చేయిస్తే ప్రేక్షకులు మెచ్చేలా రిసీవ్ చేసుకునేలా వందకు వందశాతం సక్సెస్ అయ్యాడు నాగ్ అశ్విన్. అమితాబ్ లాంటి గొప్ప నటుడిని ఇప్పటి హీరో కొడితే సగటు ప్రేక్షకుడు జీర్ణించుకోలేడు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం వారిద్దరిలో ఏ ఒక్కరినీ తక్కువ చేయకుండా బ్యాలెన్స్ చేయగలిగాడు. ఇది నాగ్ అశ్విన్ ప్రతిభ. అటు గొప్ప నటుడిని, ఇటు పాన్ ఇండియా స్టార్ హీరోను బ్యాలెన్స్ చేయడంలో డైరెక్టర్ కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇక్కడ హీరో కోసమో, లేక గొప్ప నటుడి కోసమే కాంప్రమైజ్ అయితే సినిమా ఫలితం మరోలా ఉండేది.

సెకండాఫ్ లో ఫైట్ సీన్లకే

మహాభారతంలో కర్ణుడిగా ప్రభాస్ క్లైమాక్స్ లో కనిపించిన కొద్ది క్షణాలు అయినా గూస్ బంప్స్ తెప్పించాడు. కర్ణుడి గా ప్రభాస్ చాలా చక్కగా ఒదిగిపోయాడు. ఈ క్యారెక్టర్ ఇంకాస్త పెంచితే బాగుండు అని సగటు ప్రేక్షకుడు ఫీల్ అవుతున్నాడు. ప్రభాస్ కు స్పేస్ తక్కువ చేసిన డైరెక్టర్ కనీసం ఈ కర్ణుడి క్యారెక్టర్ అయినా ఇంకొంచెం పెంచితే బాగుండు అని అభిమానులు పేర్కొంటున్నారు. పార్ట్ -2 లో ఈ కర్ణుడి క్యారెక్టర్ లో ప్రభాస్ ను ఇంకాస్త చూపెడితే బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *