Kannapoor: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామపంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్ బ్యాటరీని మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించిన ఘటన. దీనిపైన గ్రామంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి .గ్రామపంచాయతీ ఆస్తులకు భద్రత కరువైందా? పంచాయతీకి సంబంధించిన వస్తువులకే భద్రత లేకుంటే ఊరు పరిస్థితి ఏమిటి? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీల వద్ద నిఘా నేత్రాలు ఎక్కడ? సీసీ కెమెరాలు ఉంటే ఇటువంటి పరిస్థితులు పునరావృతం కావని పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి గ్రామపంచాయతీ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి కార్యకలాపాలు జరగకుండా నిరోధించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
శెనార్తి మీడియా,శంకరపట్నం