Selfi Point: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ‘మంచి మంచిర్యాల’ సెల్ఫీ పాయింట్ అక్షరాలు రాత్రికి రాత్రే మాయమయ్యాయి. సోమవారం తెల్లవారే సరికి ఖాళీగా కనిపించింది. మంచిర్యాల మున్సిపాలిటీ సుమారు రూ. 20 లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ సెల్ఫీ పాయింట్ కొద్ది కాలంలోనే నిర్వహణ లోపించి దారుణంగా మారింది.
అక్షరాల తొలగింపు వెనుక కారణాలు తెలుసుకునేందుకు సంబంధిత మున్సిపల్ అధికారులను సంప్రదించగా, వారు అందుబాటులోకి రావడం లేదు. ఇటీవల ‘మంచి మంచిర్యాల’ కు వెనుక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.3 కోట్లు ఖర్చు చేశారు. అయితే అక్కడ నిర్మాణం కూల్చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ కొట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రజలు ఆర్థిక వృథా పై చర్చించుకుంటున్న తరుణంలో ‘మంచి మంచిర్యాల’ మాయం కావడం మరింత ఆందోళనను రేకెత్తిస్తున్నది.
శెనార్తి మీడియా, మంచిర్యాల