- 50 ఏళ్ల తర్వాతే ఇదే
- ఒకే సిరీస్ లో 13 మంది డకౌట్
- భారత బ్యాట్స్ మెన్ల తీరుపై వెల్లువెత్తున్న విమర్శలు
Team India: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ టీమిండియా ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదు. ఇందులో మొదటి రెండు మ్యాచ్‌లలో దారుణ ఓటమిని చవిచూసింది. ముంబై టెస్ట్‌లో, టీమిండియా మొదటి ఇన్నింగ్స్ కూడా తక్కువ పరుగులకే పరిమితమైంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు, భారత జట్టు బ్యాట్స్‌మెన్ పేలవమైన ప్రదర్శనను క్రీడాభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. వారు మొదట బెంగళూరు టెస్ట్, తరువాత పూణేలో ఏకపక్ష ఓటమిని పాలైన విషయం తెలిసిందే. భారత జట్టు బ్యాట్స్‌మెన్ 50 ఏళ్ల నాటి చెత్త రికార్డును కూడా బద్దలు కొట్టారంటే ఆటతీరు ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
50 ఏళ్ల నాటి చెత్త రికార్డు బ్రేక్
ఇప్పటివరకు, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియాలోని 13 మంది ఆటగాళ్లు డకౌట్ అయ్యారు. ఇందులో ముంబై టెస్ట్ మ్యాచ్‌లో ఇంకా ఒక ఇన్నింగ్స్ మిగిలి ఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఈ సంఖ్య కూడా పెరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు. భారత జట్టుకు సంబంధించి, ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో మూడు లేదా అంతకంటే తక్కువ మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో డకౌట్ అయిన ఆటగాళ్ల గరిష్ట సంఖ్య ఇది. అది కూడా సొంతగడ్డపై ఈ రికార్డు నమోదైంది. అంతకుముందు 1974లో ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టులోని 12 మంది ఆటగాళ్లు టెస్టు సిరీస్‌లో డకౌట్ అయ్యారు. ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టింది రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు. భారత జట్టు చరిత్రలలోనే అవమానకరమైన చెత్త రికార్డుగా నిలిచింది.
మూడు లేదా అంతకంటే తక్కువ మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టుకు అత్యధికంగా డకౌట్లు
13 – వర్సెస్ న్యూజిలాండ్ (2024, స్వదేశంలో)
12- ఇంగ్లండ్ (1974 విదేశంలో)
10- వర్సెస్ ఆస్ట్రేలియా (1999-2000, స్వదేశంలో)
10 – వర్సెస్ దక్షిణాఫ్రికా (2021-21, స్వదేశంలో)
ముంబై టెస్టులో ముగ్గురు డకౌట్
టీమిండియా తరపున, ముంబై టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ముగ్గురు ప్లేయర్లు డకౌట్ అయ్యారు. మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ తో పాటు సర్ఫరాజ్ ఖాన్ పేరు ఈ జాబితాలో ఉన్నాడు. డకౌట్ అయ్యి పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు