biopics

Biopics:వెండితెరపై స్పోర్ట్స్ స్టార్స్ బయోపిక్స్

  • బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తున్న క్రీడా నేపథ్య చిత్రాలు
  • జూన్ 14న మరో బయోపిక్ చందు చాంపియన్ విడుదల

Biopics : క్రీడా నేపథ్యంలో తీస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తున్నాయి. క్రీడాకారుల బయోపిక్ లు, వివిధ క్రీడా నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించడం వెండి తెరకు కొత్తేమీ కాదు. గతంలో ఎన్నో క్రీడానేపథ్యంతో వచ్చిన సినిమాలు హిట్టు కొట్టాయి. నిర్మాతలకు కాసులు కురిపించగా, నటీనటులకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. డైరెక్టర్లు, ఇతర టెక్నీషియన్లు వీటిని సరిగ్గా డీల్ చేయగలిగితేనే సక్సెస్ అవుతాయి. ఏ కొంచెం తేడా కొట్టిని అంతే సంగతులు..

ఈ శుక్రవారం (జూన్ 14)న కార్తీక్ ఆర్యన్ ‘చందు ఛాంపియన్’ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. అదే సమయంలో, నిజ జీవితంలోని క్రీడా హీరోల నుంచి స్ఫూర్తి పొందేందుకు ఇదే సరైన సమయం. ‘చందు ఛాంపియన్’ భారతదేశపు మొట్టమొదటి పారా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన బయోపిక్ ఇది. స్ఫూర్తినిచ్చేలా, నిజ జీవిత ఛాంపియన్ల బ్యాక్ డ్రాప్ ఆధారంగా ఐదు సినిమాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

సుర్మా(Surma)

దిల్జీత్ దోసాంజ్ చిత్రీకరించిన సందీప్ సింగ్ రియల్ లైఫ్ స్టోరీని సూర్మాలో తెరకెక్కించారు. హర్యానాకు చెందిన భారతీయ ప్రొఫెషనల్ ఫీల్డ్ హాకీ ప్లేయర్, భారత జాతీయ హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్. పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్‌. తన గాయాన్ని సైతం లెక్క చేయకుండా దేశం కోసం ఆడారు. భారత ప్రసిద్ధ హాకీ కెప్టెన్లలో సందీప్ సింగ్ గుర్తింపు తెచ్చుకున్నారు. అర్జున అవార్డు గ్రహీత సందీప్ కామన్వెల్త్, ఆసియా క్రీడలలో పతకాలు సాధించాడు. ప్రమాదవశాత్తూ పక్షవాతానికి గురయ్యాడు. తర్వాత ఆట పట్ల అతని సంకల్పం, అభిరుచి అతని అద్భుతమైన పునరాగమనానికి ఆజ్యం పోసింది. దిల్జీత్ దోసాంజ్, తాప్సీ పన్ను, అంగద్ బేడి నటించిన ఈ చిత్రం సందీప్ సింగ్ హాకీలో అతని అసాధారణ విజయాలను హైలైట్ చేస్తూ కష్టాల నుంచి విజయం వైపు సాగిన ప్రయాణాన్ని చక్కగా తెరకెక్కించారు.

మేరీ కోమ్(Marry Com)

ప్రియాంక చోప్రా నటించిన చిత్రం మేరీ కోమ్. ప్రపంచ ఛాంపియన్ కావాలనే తన కలను నెరవేర్చుకోవడానికి అనేక అడ్డంకులను అధిగమించిన భారతీయ బాక్సర్ మాంగ్టే చుంగ్నీజాంగ్ మేరీ కోమ్. ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ఇందులో తెరకెక్కించారు. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, 2012 ఒలింపిక్ కాంస్య పతక విజేత. మేరీ కోమ్ చరిత్రలో ఆరు ప్రపంచ టైటిళ్లను గెలుచుకున్న మొదటి మహిళా బాక్సర్. ఆమె ఐదుసార్లు ఆసియా ఛాంపియన్. 2014 ఆసియా క్రీడలలో బంగారు పతకాన్ని గెలుచుకున్న తొలి భారత మహిళా బాక్సర్ కూడా ఆమె కావడం విశేషం. ఆమె కవలలకు జన్మనిచ్చిన తర్వాత కూడా రింగ్ లోకి అనూహ్య విజయాలు సాధించింది. 2012 ఒలింపిక్స్‌లో పతకాన్ని గెలుచుకుంది. 2018లో తన ఆరో ప్రపంచ టైటిల్‌ను గెలిచి ద్వారా అగ్రస్థానంలో నిలిచి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. సంవత్సరం తర్వాత ఆమె తన ఎనిమిదో ప్రపంచ పతకాన్ని గెలిచి తన విజయ పరంపరకు తిరుగులేదని నిరూపించుకుంది. భారత బాక్సింగ్ చరిత్రలో ఈ అరుదైన ఘనత ఒక్క మేరీకోమ్ కే దక్కింది. మేరీకోమ్ బయోపిక్ లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. మేరీకోమ్ భర్త పాత్రలో దర్శన్ కుమార్, కోచ్ పాత్రలో సునీల్ థాపా సినిమాకు జీవం పోశారు. వీరి అద్భుత నటనతో ఈ నిజ జీవితచరిత్ర స్పోర్ట్స్ డ్రామాను స్ఫూర్తిదాయకంగా, హృదయానికి హత్తుకునేలా తెరకెక్కింది.

భాగ్ మిల్కా భాగ్  (Bhag Milka Bhag)

‘ఫ్లయింగ్ సిక్కు’ గా పేర్కొందిన మిల్కా సింగ్‌ పాత్రలో భాగ్ మిల్కా భాగ్‌లో ఫర్హాన్ అక్తర్ అద్భుతమైన నటనను కనబరిచాడు. ఈ చిత్రం అల్లకల్లోలమైన బాల్యం నుంచి కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల్లో బంగారు పతకాలను గెలుచుకోవడం, భారతదేశపు గొప్ప అథ్లెట్లలో ఒకరిగా ఎదిగిన ప్రయాణాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఫర్హాన్ అక్తర్, సోనమ్ కపూర్, దివ్య దత్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వ్యక్తిగత, వృత్తిపరమైన సవాళ్లను అధిగమించడానికి మిల్కా సింగ్ అలసిపోని సంకల్పాన్ని చూపించింది. అంకితభావం, పట్టుదల, స్ఫూర్తిదాయకమైన కథ.

పాన్ సింగ్ తోమర్ (Pansingh Thomar)

ఇర్ఫాన్ ఖాన్ భారతీయ సైనికుడు, స్టీపుల్‌చేజ్ ఛాంపియన్ అయిన పాన్ సింగ్ తోమర్ ఆకర్షణీయమైన పాత్ర. దొంగ నుంచి చాంపియన్ గా ఎదిగిన కథ. ఇండియన్ నేషనల్ గేమ్స్‌లో వరుసగా ఏడుసార్లు బంగారు పతకాలు సాధించిన పాన్ సింగ్ తోమర్ తిరుగు బాటు ధోరణి కారణంగా సామాజిక-రాజకీయ సమస్యల్లో కూరుకుపోయాడు. ఇర్ఫాన్ ఖాన్, మహి గిల్, విపిన్ శర్మ పాత్రలు ఆకట్టుకున్నాయి.

ఎంఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ

ఎంఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ అత్యంత విజయవంతమైన భారత క్రికెట్ కెప్టెన్
మహేంద్ర సింగ్ ధోని నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోని పాత్రలో జీవించాడనే చెప్పాలి. అంత అద్భుతంగా నటించాడు సుశాంత్. ‘ది మ్యాన్ యు నో… ది జర్నీ యూ డోంట్ నో’ అనే ట్యాగ్‌లైన్‌తో, ఈ చిత్రం 2011 ఐసీసీ ప్రపంచ కప్‌తో సహా అనేక విజయాల దిశగా భారత్‌ను నడిపించే వరకు ధోని ప్రయాణాన్ని తెరపై చాలా చక్కగా రూపొందించారు. కియారా అద్వానీ, దిశా పటానీలను తమ నటనతో ఆకట్టుకున్నారు. క్రికెట్ లెజెండ్ జీవితాన్ని దగ్గరగా చూపించింది ఈ సినిమా.

చందు ఛాంపియన్: ది మ్యాన్ హూ రిఫ్యూజ్ టు సరెండర్

ఏక్ థా టైగర్, బజరంగీ భాయిజాన్ ఫేమ్ కబీర్ ఖాన్ చందు ఛాంపియన్ సినిమాను తెరకెక్కించాడు. ఈ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామాలో కార్తీక్ ఆర్యన్ నటించాడు. భారతదేశపు మొట్టమొదటి పారాలింపిక్ బంగారు పతక విజేత మురళీకాంత్ పేట్కర్ పాత్రలో నటించాడు. యుద్ధ వీరుడు నుంచి క్రీడా దిగ్గజం వరకు అతని అసాధారణ ప్రయాణాన్ని ఇందులో తెరకెక్కించారు. అన్ని అసమానతలను అధిగమించిన వ్యక్తి అపురూపమైన ధైర్యసాహసాలతో కూడిన కథ ఇది. ఈ పాత్ర కోసం కార్తీక్ మేకోవర్ ఎక్స్ ట్రార్డినరీ అనే చెప్పాలి. అతని డెడికేషన్ ను మేకోవర్ తో అర్థం చేసుకోవచ్చు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *