- సెక్యూరిటీ గార్డు దాడిలో గాయపడిన ఏబీవీ నాయకుడు
- తల పగలడంతో పరిస్థితి విషమం
Basara IIIT :బాసర ఆర్జీయూకేటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొద్ది రోజులుగా శాంతియుతంగా ఉన్న క్యాంపస్లో సోమవారం స్వాతి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో ట్రిపుల్ ఐటీ ముఖ ద్వారం వద్ద ఏబీవీపీ నాయకులు నిరసన తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీలో స్వాతి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న వివరాలు ఇంకా తెలియరాలేదు. విద్యార్థుల సంఘం ఏబీవీపీ నాయకులు బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడి చేయగా కళాశాల పోలీసు ఉన్నతాధికారి ఆజ్ఞ మేరకు సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో ఏబీవీపీ నాయకుల పై దాడికి పాల్పడ్డారు. ఇందులో కొందరు గాయాల పాలవ్వగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సెక్యూరిటీ గార్డుల దాడిలో తల పగలడంతో అక్కడే పడిపోయాడు. ఏబీవీపీ నాయకుడు దాదాపు గంటపాటు కళాశాల ప్రధాన ద్వారం వద్దే పడి ఉన్నా ఏ ఒక్కరూ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. దీంతో క్యాంపస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.
శెనార్తి మీడియా, నిర్మల్: