Indian Medical Association: పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో మహిళా డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటనను ఖండిస్తూ శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ఐబీ చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ అన్ని ముఖ్య కూడళ్ల మీదుగా జరిగింది. అనంతరం ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రమణ మాట్లాడుతూ. కోల్‌కత్తాలో వైద్యురాలి హత్యాచారం ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వైద్యులు రోడ్డెక్కారు. 24 గంటలు వైద్య సేవలు నిలిపివేసి నిరసన తెలిపారు. డాక్టర్ల ఆందోళనలతో ఓపీ సేవలు నిలిచిపోయాయి. మహిళా డాక్టర్లపై హత్యాచార ఘటనలను అరికట్టాలని నిరసన ర్యాలీ చేపట్టారని. కోల్కతాలో వైద్యురాలిని హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులపై ఇటువంటి దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. హాస్పిటల్లోనే మహిళా వైద్యులకు, మహిళలకు రక్షణ కల్పించలేక పోతున్నారని విమర్శించారు. ఇతర రాష్ట్రాలలో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ ఘటన చూసి తమ కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. మహిళా వైద్యులకు రక్షణ కల్పించాలని, ఆ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ఆసుపత్రి డాక్టర్లు, మెడికల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :