Photography Day: మంచిర్యాల మున్సిపాలిటీకి, అబ్బురపరిచే సజీవ చిత్రాలు… ఆకట్టుకునే పోలీస్ శాఖకు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఉమ్మడి డాక్యుమెంటేషన్ ఆయన ప్రత్యేకం… పలువులు కలెక్టర్లచే ప్రశంసలు… అరుదైన ఫోటోగ్రఫీతో ఆదర్శంగా నిలుస్తున్న ఫోటోగ్రాఫర్ ఉమా యాడ్స్ రాజు… నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాజు సేవలపై ప్రత్యేక కథనం… మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఉమా యాడ్స్ నిర్వాహకుడు జక్కుల రాజు అందరి మనసును ఆకట్టుకునే తన అరుదైన ఫోటోగ్రఫీ కల ద్వారా పలువురు కలెక్టర్లచే రెవెన్యూ మున్సిపల్ అధికారులచే ప్రశంసలు సన్మానాలు పొందుతూ మంచిర్యాలలో ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా రాణిస్తూ గుర్తింపు తెస్తున్నారు.
28 సంవత్సరాలు పైగా ఫోటోగ్రఫీ వీడియోగ్రాఫీ చేస్తూ సార్వత్రిక ఎన్నికల్లో ఐదు సంవత్సరాలు తన ప్రతిభను చూపి రెవెన్యూ ఉన్నతాధికారులతో అనేక అవార్డులు అందుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా కలెక్టర్, ఉట్నూర్ ఇన్చార్జి పిఓ వరుణ్ రెడ్డి, గాంధారి ఖిల్లా డాక్యుమెంటేషన్ తిలకించి ఉమా యాడ్స్ రాజుని ఘనంగా సత్కరించారు. అప్పటి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కర్జన్ 2017 లో అవార్డులు అందజేశారు. మీకోసం అనే డాక్యుమెంటేషన్ చూసి ఆసిఫాబాద్ ఎస్పీ సురేష్ కుమార్ రాజుకు ప్రశంసలు కురిపించారు. మేడారం సమ్మక్క సారక్క జాతర మహోత్సవాల పై డాక్యుమెంటేషన్ చేసి గుర్తింపు పొందిన ఉమా యాడ్స్ రాజు రాష్ట్రస్థాయి. ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో పాల్గొని రెండవ బహుమతి సొంతం చేసుకున్నాడు. అందరితో కలివిడిగా స్నేహపూర్వకంగా ఉండే రాజు ఫోటోగ్రఫీలో రారాజుగా నిలుస్తున్న రాజు మరెన్నో ఉత్తమ డాక్యుమెంటేషన రాష్ట్ర జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ గుర్తింపు పొందేలా నిరంతర శ్రామికునిలా ఫోటోగ్రఫీని ప్రేమిస్తూ ఆదరిస్తున్న ఉమా యాడ్స్ స్టూడియో జక్కుల రాజు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎందరో యువకులను తన వద్దకు చేరదీసి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ రంగంలో తనదైన శైలిలో నేర్పిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు.కలెక్టర్లు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులచే ప్రశంసలు -సన్మానాలు పొందుతున్నాడు. దాంతో మంచిర్యాలలో ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా ఆయనరాణిస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు. ఆయన సేవలు ఎన్నెన్నో….
ఇరవై సంవత్సరాలు పైగా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేస్తూ ఇప్పటివరకు సార్వత్రిక ఎన్నికల్లో ఐదు సార్లు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేసి పలువురు రెవెన్యూ ఉన్నత అధికారులతో.. ప్రశంసలు పొందారు. అంకిత భావంతో తన కెమెరాతో వైవిధ్యర్థమైన ఫోటోలు బంధించి మంచిర్యాల మున్సిపాలిటీకి, పోలీస్ శాఖకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేస్తూ కొన్ని అద్భుతమైన డాక్యుమెంటేషన్ చేసి ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా గుర్తింపు పొందాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా కలెక్టర్,ఉట్నూరు ఇన్చార్జి పిఓ వరుణ్ రెడ్డిలు రాజు చేసిన గాంధారి ఖిల్లా డాక్యుమెంటేషన్ చూసి అంకితభావం చేసే అరుదైన ఫోటోగ్రఫీని డాక్యుమెంటేషన్ విధానాన్ని మెచ్చుకొని ఉమా యాడ్స్ రాజును ఘనంగా సత్కరించారు. అప్పటి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కర్టన్ చే 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లా ప్రతిభ ప్రశంస పత్రాన్ని స్వాతంత్య్ర్య దినోత్సవం రోజున ఆయనకు అవార్డుగా ప్రధానం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతర శతాబ్ది ఉత్సవాలు 2023 ఉత్సవాలకు అద్భుతమైన డాక్యుమెంటేషన్ ఫోటోగ్రఫీ అందించినందుకు కూడా అడిషనల్ కలెక్టర్ రాహుల్ రాజును సత్కరించడం కూడా జరిగింది. పోలీస్ మీకోసం అనే డాక్యుమెంటేషన్ చూసి ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే సమ్మక్క సారక్క జాతర వజ్రోత్సవాలపై డాక్యుమెంటేషన్ చేసి గుర్తింపు పొందిన రాజు రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో పాల్గొని బహుమతి సొంతం వేసుకున్నాడు. అలాగే జిల్లాస్థాయిలో ఫోటోగ్రఫీ పోటీల్లో పలుమార్లు ఆవార్డులు సాధించాడు. అందరితో కలివిడిగా స్నేహపూర్వకంగా ఉండే ఆ రాజు ఫోటోగ్రఫీలో రారాజుగా నిలుస్తున్న రాజు మరెన్నో ఉత్తమ డాక్యుమెంటేషన్ రాష్ట్ర జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ గుర్తింపు పొండేలా నిరంతర శ్రామికునిలా ప్రతినిత్యం ఫోటోగ్రఫీని ప్రేమిస్తూ ఆరాదిస్తున్న ఉమా యాడ్స్ స్టూడియో జక్కుల రాజు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పడంలో అసలు సందేహం లేదు. అనంతరం మంచిర్యాల్ ఆర్డీవో వొడ్నాల రాములు చేతుల మీదుగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఉత్తమ ఫోటోగ్రాఫర్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల