రాష్ట్ర నాయకులు చిక్కాల రవి కిరణ్ యాదవ్
Niramal:నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలం అంబకంటి గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఓ వర్గానికి చెందినవారు కావాలని యాదవులను కించపరుస్తూ యాదవుల ఇంటి ముందర.. కించపరిచే పాటలను పెడుతూ అసభ్య పదాలతో మాట్లాడడం సమంజసం కాదని.. వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని యాదవ సంఘం రాష్ట్ర నాయకులు చిక్కాల రవికిరణ్ యాదవ్ అన్నారు.. వినాయక నిమజ్జనం సందర్భంగా యాదవ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ ఓ వర్గానికి చెందిన సామాజిక వర్గం సభ్యులు కావాలని రెచ్చ గొట్టేలా చేయడం సరైనది కాదన్నారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు.