loan harrasement

Loan Harrasement : మంచిర్యాలలో లోన్ రికవరీ ఏజెంట్ వేధింపులు

నేరుగా ఇంట్లోకి వచ్చి బెదిరింపులు
బ్యాంకుకు వచ్చి మాట్లాడతామని చెప్పినా వినిపించుకోని వైనం..
పది నెలలుగా అనారోగ్యంతో కార్మికుడు
బ్యాంకు ఏజెంట్ల వేధింపులతో ఆందోళనకు గురై మరింత అనారోగ్యం బారిన కార్మికుడు

Loan Harrasement : కొంతకాలంగా బ్యాంకు లోన్ రికవరీ ఏజెంట్లు, రుణయాప్ నిర్వాహకులు రుణగ్రహీతలను వేధింపులను గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మంచిర్యాలకు ఓ చెందిన ఓ యువకుడు లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు ఆత్మహత్య చేసుకోగా, మరో లోన్ రికవరీ ఏజెంట్ వేధింపులతో సింగరేణి కార్మికుడు ఆందోళన చెంది మరింత అనారోగ్యానికి గురయ్యాడు.

బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా నస్పూర్ కు చెందిన ఓ సింగరేణి కార్మికుడు రెండళ్ల క్రితం ఓ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాడు. వాయిదాలు క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తున్నాడు. లోన్ తీర్చడానికి ఇంకా మరో ఏడాది సమయం ఉన్నది. సదరు సింగరేణి కార్మికుడు పది నెలల క్రితంఅనారోగ్యానికి గురి కాగా, నాలుగు వాయిదాల చెల్లింపుల్లో జాప్యమైంది. దీంతో లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులతో పాటు వారికి పరిచయం ఉన్న వారికి తాము హెచ్‌డీఎఫ్ సీ బ్యాంకు ఏజెంట్లమని ఫోన్లు చేస్తున్నారు. మీకు తెలిసిన వ్యక్తి (సింగరేణి కార్మికుడు) మా బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాడు. రెఫరన్స్ గా మీ సెల్ నంబర్ తో పాటు ష్యూరిటీ మీ పేరు ఉందని చెబుతున్నారు. డబ్బులు సదరు కార్మికుడు చెల్లించకుంటే మీరే చెల్లించాల్సి వస్తుందని, లేకుంటే బ్యాంకు నుంచి లీగల్ నోటీసులు పంపుతామంటూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. దీంతో సదరు సింగరేణి కార్మికుడికి తెలిసిన వారు భయాందోళనకు గురై రుణగ్రహీతను సంప్రదిస్తున్నారు. తాను ఎవరి నంబర్లు ఇవ్వలేదని, ఎవరినీ ష్యూరిటీగా పెట్టలేదని, ఈ ఫోన్లు ఇతరులకు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆవేదన చెందుతున్నాడు. ఇలా తనకు తెలిసిన వారందిరకీ బ్యాంకు నుంచి ఫోన్లు చేస్తూ తమను అవమానిస్తున్నారంటూ వాపోతున్నాడు. తాము తీసుకున్న రుణం చెల్లిస్తామని చెబుతున్నా వేధింపులకు ఆగడం లేదని సదరు సింగరేణి కార్మికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఇంటి వద్ద రభస
తాము లోన్ రికవరీ ఏజెంట్లమంటూ కొందు వారం పదిరోజులకు ఇంటికి వస్తున్నారని సదరు సింగరేణి కార్మికుడు తెలిపారు. తాను అనారోగ్యంతో ఉన్నానని, పది నెలలుగా విధులకు కూడా వెళ్లడం లేదని, అయినా వాయిదాలు చెల్లిస్తున్నానని, కేవలం నాలుగు వాయిదాలు చెల్లించలేపోయానని చెబుతున్నాడు. ప్రస్తుతం తన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కొద్ది రోజులు సమయం ఇవ్వాలని, త్వరలో మిగిలిన రుణం డబ్బులు చెల్లిస్తానని చెల్లిస్తానని చెబుతున్నా సదరు ఏజెంట్లు వినిపించుకోవడం లేదని వాపోతున్నాడు. తమ బ్యాంకు మేనేజర్ మాట్లాడమంటూ ఏజెంట్లు ఫోన్ ఇస్తున్నారని, సదరు మేనేజర్ తో మాట్లాడామని లోన్ చెల్లిస్తామని చెప్పామని తెలిపారు. అయితే తమకు కొంత సమయం కావాలని కోరామని, అందుకు సదరు మేనేజర్ సరేఅన్నాడని బాధితుడు తెలిపారు. అయితే మళ్లీ వారం రోజులకు మరో వ్యక్తి వచ్చి తాను బ్యాంకు లోన్ రికవరీ ఏజెంట్‌నంటూ ఇంటికి వచ్చి డబ్బులు చెల్లించాలంటూ గొడవకు దిగాడని, ఇంట్లోకి వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఐడీ కార్డు లేదట.. స్టేట్ మెంట్ కాపీ ఇవ్వడట

గురువారం నస్పూర్ లోని సదరు సింగరేణి కార్మికుడి ఇంటికి ఓ ఏజెంట్( శ్రీనివాస్ మట్టెల, సెల్ 9866035235) వచ్చాడు. కనీసం ఇంట్లోని వారిని పిలవకుండా నేరుగా ఇంట్లోకి వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని బాధిత కుటుంబం పేర్కొన్నది. అయితే సదరు ఏజెంట్ ను ఐడీ కార్డు చూపాలని కోరితే లేదంటున్నాడు. కనీసం లోన్ తాలూకు స్టేట్ మెంట్ కాపీ ఇవ్వమని అడిగితే బ్యాంకుకు వచ్చి తీసుకోమంటున్నాడు. తప్ప తాను ఏ బ్యాంకుకు సంబంధించిన ఏజెంటనేది మాత్రం చెప్పడం లేదు. బాధిత కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

చుట్టు పక్కల వారి నంబర్లు ఎవరిచ్చారు?
బ్యాంకు నుంచి లోన్ తీసుకునే సమయంలో కేవలం రెఫరన్స్ గా మరో నంబర్ మాత్రమే ఇచ్చామని కార్మికుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ తమకు తెలిసిన వారికి ఫోన్లు చేస్తూ లోన్ చెల్లించాలని అడుగుతున్నారని కార్మికుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ పరిచయస్తులు ఫోన్ చేసి బ్యాంకులో మా నెంబర్ ఎప్పుడిచ్చావని అడుగుతున్నారని, దీంతో ఏం చెప్పాలో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. అసలు తాము ఇవ్వని నంబర్లు వాళ్లు తెలుసుకున్నారని, రికవరీ ఏజెంట్లు, కాల్ సెంటర్ కు నంబర్లు ఎలా వెళ్లాయని ప్రశ్నిస్తున్నారు.

అప్పుడేమో వెంట పడి.. ఇప్పుడేమో వేధిస్తూ.
సింగరేణి కార్మికుడు కావడంతో బ్యాంకు నుంచి ఫోన్లు చేసి సిబిల్ స్కోర్ బాగుందని, ఎలాంట ష్యూరిటీలు అవసరం లేదని, లోన్ ఇస్తామని వెంట పడ్డారు. నిర్ణీత సమయంలోపల ఎప్పుడైనా చెల్లించుకోచ్చని చెప్పారు. కానీ ఏడాది తర్వాత లోన్ మొత్తం చెల్లించడానికి వెళితే ప్రీ క్లోజింగ్ చార్జీల పేరిట మిగిలిన రుణంపై నాలుగు శాతం అదనంగా చెల్లించాలంటూ కొర్రీలు పెట్టారని సింగరేణి కార్మికుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. లోన్ ఇచ్చే సమయంలో ముందస్తు చెల్లింపులకు ఎలాంటి చార్జీలు ఉండవని చెప్పారని, ఇప్పుడు అదనంగా చెల్లించాలంటున్నారని తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *