Papayyapalli : మండలంలోని కేశవపట్నం పరిధిలో గల పాపయ్యపల్లి గ్రామానికి సరైన రోడ్డు మార్గం, అదేవిధంగా వాగు పై హై లెవెల్ వంతెన నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వర్షాకాలంలో నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు, హైలెవల్ వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ సోమవారం గ్రామ శివారులోని వాగులో నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేశవపట్నం నుంచి హుస్నాబాద్ వరకు వివిధ గ్రామాల ప్రజలు నిత్యం ఈ రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తుంటారని, గ్రామస్తులు కూడా మండల కేంద్రానికి వెళ్లాలంటే ఈ రోడ్డే వారికి ఆధారమని పేర్కొన్నారు. ఉన్న రోడ్డు కూడా సరిగా లేదని, చిన్న వర్షానికే బురదగా కాలినడకన కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయన్నారు. ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పాపయ్య పల్లెకు సరైన రోడ్డు మార్గం, వాగుపై హై లెవెల్ వంతెన నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
శెనార్తి మీడియా,శంకరపట్నం: