anjaniputhra (3)

Ganesh: ఆకట్టుకున్న అంజనీపుత్ర ఎస్టేట్ గణనాథుని శోభాయాత్ర

Ganesh:మంచిర్యాల జిల్లాలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న అంజనీ పుత్ర విఘ్నేశ్వరుడి లడ్డు రికార్డు సృష్టించింది. గత రికార్డును బ్రేక్‌ చేస్తూ 111 కిలోల లడ్డూను మంచిర్యాల పట్టణానికి చెందిన చిందం చరణ్ తేజ్ కు ఫ్రీ లక్కిడ్ర ద్వారా దక్కించుకున్నారు. ఫ్రీ లక్కీ డ్రా లో 12 వేల మంది భక్తులు పోటీ పడగా మంచిర్యాల పట్టణానికి చెందిన చరణ్ తేజ్ కు అంజనీ పుత్ర విఘ్నేశ్వరుడి 111 కిలోల ప్రసాదం వరించింది. ఈ సందర్భంగా వారు అంజనీపుత్ర అధినేత గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు ఎంతో విశిష్టత పూజలు నిర్వహించి అ గన్నాధుని శోభయాత్ర నిర్వహించి నిమజ్జనం చేస్తున్నామని తెలిపారు. తొమ్మిది రోజులపాటు ఉచితంగా లక్కీ డ్రా కుపన్ ఏర్పాటు చేశామని తెలిపారు. సుమారు 12 వేల మంది భక్తులు ఫ్రీ లడ్డు కూపన్లను పొందరని అన్నారు. శోభాయాత్ర సందర్భంగా మండపం వద్ద ఫ్రీ లక్కీ కూపన్ డ్రా నిర్వహించడంతో మంచిర్యాల పట్టణానికి చెందిన చిందాం చరణ్ తేజ్ అనే భక్తుడికి కూపన్ ద్వారా 111 కిలోల లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నామని అన్నారు. ఈ శోభయాత్రలో జిల్లా నలుమూలలనుండి ఒగ్గు కళాకారులూ, యాక్ష ఘనం, మహిళా కోలాటలానడుమ ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణంలో చున్నాంబట్టి, ఐబీ చౌరస్తా, వెంకటేశ్వర థియేటర్, ఓవర్ బ్రిడ్జ్ వద్దా నుండి శోభాయాత్ర నిర్వహించి అంజనీపుత్ర విఘ్నేశ్వరుడిని గోదావరిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర సిబ్బంది, సూపర్వైజర్లు, ఏజెంట్లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

anjaniputhra (2)
శోభాయాత్రలో అంజనీ పుత్ర ఎస్టేట్ నిర్వాహకులు

శెనార్తి మీడియా, మంచిర్యాల

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *