Shanigakunta: మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని శనిగకుంట చెరువు మత్తడి కాంక్రీట్ నిర్మాణాన్ని సోమ వారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బ్లాస్టింగ్ మెటీరియల్ ఉపయోగించి పేల్చారు. ఈ చెరువు చెన్నూర్ హైవేకు ఆనుకొని ఉండటంతోపాటు పక్కనే వెంచర్ సైతం ఉంది. మరోవైపు చెరువులోకి నీరు ఎక్కువవుతుండటంతో వెంచర్లోకి నీరు వస్తుందనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మత్తడిని పేల్చడంతో చెరువు కింద ఉన్న 43 ఎకరాల ఆయకట్టు రైతులు, మత్స్యకారులకు తీవ్రంగా నష్టం జరుగనుండని వారు వాపోతున్నారు. మంగళవారం సమాచారం అందుకున్న చెన్నూర్ డివిజన్ ఇరిగేషన్ ఈఈ విష్ణు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాడు మేరకు సీఐ రవీందర్ కేసు నమోడు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల