శెనార్తి మీడియా, మంచిర్యాల/ గోదావరిఖని :
Ramagundam Police : పోలీస్ వాహనాలను ఎప్పటికప్పుడు కండీషన్ లో ఉంచుకోవాని అడిషనల్ డీసీపీ(అడ్మిన్) సీ రాజు అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల పరిధిలోని పెట్రో కార్, రక్షక్, హైవే పెట్రోలింగ్ పోలీసు వాహనాల పనితీరు, వాటి నిర్వహణను అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ రాజు ఎంటీఓలు, ఐటీ కోర్, కమ్యూనికేషన్ ఇన్ స్పెక్టర్లతో కలిసి కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో సోమవారం పరిశీలించారు.
Ramagundam Police Vehicels
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిరంతరం గస్తీ నిర్వహిస్తూ, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలన్నారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని చెప్పారు. ప్రజల సమస్యలను చట్ట పరిధిలో తీర్చాలనే ఉద్దేశ్యంతో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, ప్రో ఆక్టివ్ పోలీసింగ్ కోసం బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ సిబ్బంది స్కూల్స్, కాలేజీలు, బస్టాండ్, రద్దీ ప్రాంతాల్లో, విసబుల్ పోలీసింగ్,హై వె పెట్రోలింగ్ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడడంతో పాటు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు తక్షణ సహాయం అందించాలన్నారు. ప్రజలకు సమర్ధవంతమైన సేవలు అందించేందుకు పెట్రో కార్ ,హై వే పెట్రోలింగ్ వాహనల పనితీరు, నిర్వహణ, ట్యాబ్స్ పనితీరు, వీహెచ్‌పీ సెట్ పనితీరు, జీపీఎస్ పనితీరు, టూల్ కిట్స్ తనిఖీ చేసి వారు నిర్వహిస్తున్న విధుల గురించి డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్ లలోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో గల పోలీస్ వాహనాలు నిరంతరంగా వివిధ ప్రజాసేవలకు, ఎలాంటి ఆటంకం కలగకుండా సాఫీగా ప్రజా సేవలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. వాహనాల నిర్వహణ లోటుపాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి సమగ్ర నివేదికను నెలవారీగా సమర్పించాలని మోటార్ వాహనాల అధికారులు, ఇతర అధికారులకు సూచించారు. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు .మంచి కండిషన్లో ఉంచుకోవాలని డ్రైవర్లను ఆదేశించారు. విధుల్లో ఉన్నపుడు పోలీస్ యునిఫామ్ తప్పని సరిగా ధరించాలి. డ్రైవింగ్ సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు .ఎట్టి పరిస్థితుల్లో మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దన్నారు. మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని సూచించారు. వాహనాన్ని ప్రభుత్వ విధులకు మాత్రమే వినియోగించాలని చెప్పారు. పోలీసు వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచుకోవాలన్నార. పెట్రో కార్ వాహనాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రాగన్ లైట్, రోప్స్, కోన్స్, క్రైమ్ ప్రొటాక్ట్ రిబ్బన్, రైట్ గేర్ కిట్(హెల్మెట్, స్టోన్ గార్డ్, లాఠీ, బాడీ ప్రొటెక్టర్) తప్పనిసరిగా ఉండాలని సూచించారు. పెట్రోల్ వెహికల్, హైవే పెట్రోలింగ్ వెహికల్ మూమెంట్ ని ఐటీ కోర్ టీమ్, పీసీఆర్ టీమ్ ఎప్పుడు గమనిస్తూ ఉంటాయన్నారు. విధుల్లో అలసత్వం చూపితే శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ ప్రమోదరావు, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, శ్రీధర్, ఐటీ అండ్ సీ ఇన్‌స్పెక్టర్ రాంప్రసాద్, పెద్దపల్లి జోన్ ఎంటోఓ కన్న మధు, బెల్లంపల్లి ఎంటీఓ సంపత్, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్,ఎస్ఐ రాణి, వినోద్, ఐటి కోర్ హెడ్ కానిస్టేబుల్ రాము, పాల్గొన్నారు.