పట్టించుకోని మున్సిపల్ అధికారులు
Siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్మార్ట్ టాయిలెట్స్ నిరుపయోగంగా మారాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) అట్టహాసంగా ప్రారంభించగా, అవి మూణ్నాళ్లకే శిథిలవస్థకు చేరాయి. సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యాయి. పట్టణంలో బహిరంగ మల, మూత్ర విసర్జనను అరికట్టేందుకు నిర్మించిన స్మార్ట్ టాయిలెట్స్ ఎందకు పనిరాకుండా మారాయి. మున్సిపల్ అధికారులు స్పందించి స్మార్ట్ టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకురావాలని సిరిసిల్ల ప్రజలు కోరుతున్నారు.
శెనార్తి మీడియా, సిరిసిల్ల