Social Welfare Degree College

Mancherial :గురుకుల కళాశాల విద్యార్థినికి  కరెంట్ షాక్

  • లాప్ టాప్ చార్జింగ్ పెడుతుండగా ఘటన
  • స్పందించని కాలేజ్ ప్రిన్సిపాల్
Student Vaishnavi
Student Vaishnavi

Mancherial  మంచిర్యాల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో ఓ విద్యార్థిని విద్యుత్ షాక్ కు గురైంది. కాలేజ్ లోని ఓ అధ్యాపకురాలి లాప్ టాప్ ఛార్జింగ్ పెట్టె క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాలలోనికాలేజ్ రోడ్డులో గల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ విద్యార్థిని శుక్రవారం రాత్రి 7 గంటలకు విద్యుత్ షాకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ అధ్యాపకురాలు లాప్ టాప్ చార్జింగ్ పెట్టాలని వైష్ణవి అనే విద్యార్థినికి ఇవ్వగా ఈ క్రమంలో విద్యుత్ షాక్ కు గురైంది. హుటాహుటిన బాధిత విద్యార్థినిని అధ్యాపకురాలు మంచిర్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు. మెరుగైన వైద్యం నిమిత్తం ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. విద్యుత్ షాక్ కు గురైన వైష్ణవి ఖర్చులన్నీ తామే భరిస్తామని ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు వారి కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రైవేట్ గా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై ప్రిన్సిపాల్ ను వివరణ కోరేందుకు సంప్రదించగా కాల్ రిజెక్ట్ చేశారు.

 

శెనార్తి మీడియా, మంచిర్యాల

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *