T20 వరల్డ్ కప్ 2024 సూపర్-8కు చేరే తుది జట్లు ఖరారయ్యాయి. బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో నేపాల్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8కి అర్హత సాధించింది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు తాంజిమ్ హసన్ షకీబ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అద్భుతమైన ఆటతీరుతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. బౌలింగ్ లో సరికొత్త రికార్డును సృష్టించాడు.
తంజీమ్ హసన్ 21 డాట్ బాల్స్
నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో తంజిమ్ హసన్ షకీబ్ నాలుగు ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. మొత్తంగా 21 డాట్ బాల్స్ వేశాడు. టీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో, ఒక బౌలర్ 24 లీగల్ బంతులు వేయగలడు, అందులో తంజీమ్ 21 డాట్ బాల్స్ బౌల్ చేశాడు. ఏ బౌలర్‌కైనా ఇది గొప్ప రికార్డే. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచాడు. అంతకు ముందు, ఏ బౌలర్ T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో 20 డాట్ బాల్స్ కంటే ఎక్కువ వేయలేదు. తంజీమ్ సంచలన స్పెల్ కారణంగానే బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది.
బంగ్లాదేశ్ అద్భుత విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు మొత్తం 106 పరుగులు చేసింది. దీని తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన నేపాల్ జట్టు ఒక్కసారి కూడా మ్యాచ్‌లో కనిపించలేదు. కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఎయిరి జట్టుకు శుభారంభాన్ని అందించారు. కాని పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయారు. కుశాల్ 27 పరుగులు, దీపేంద్ర 25 పరుగులు చేయగలిగారు. బంగ్లాదేశ్ బౌలర్ తంజిమ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా నాలుగు ఓవర్లలో 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇది కాకుండా తస్కిన్ అహ్మద్ ఖాతాలో ఒక వికెట్ పడింది. ఆఖరి ఓవర్లో షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు తీశాడు.
సూపర్-8లో ఈ 3 జట్లతో పోరు
బంగ్లాదేశ్ జట్టు సూపర్-8 గ్రూప్‌లో ఉంది. సూపర్-8లో బంగ్లాదేశ్ జట్టు భారత్, ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. జూన్ 20న ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది.