Mandamarri: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో కాలువలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలతో భగత్ సింగ్ నగర్ ఇతర ఇళ్లల్లోకి మురికినీరు ప్రవేశించడంతో ప్రజలు అనారోగ్యం పాలు అవుతూ, ఇబ్బందులు పడుతున్నామని వచ్చిన ఫిర్యాదుల మేరకు పట్టణ మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు శుక్రవారం అక్రమ కట్టడాలను తొలగించారు. రెండు రోజుల క్రితం కట్టడాలు తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది సమాయత్తం కాగా, వ్యాపారస్తులు రెండు రోజులు గడువు కావాలని కోరారు. వారి కోరిక మేరకు రెండు రోజులు గడువు ఇవ్వగా, నేడు కాలువల పై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని ఎం తిరుపతమ్మ ఆధ్వర్యంలో జెసిబి సహాయంతో తొలగించారు. ఈసందర్భంగా పట్టణ ఏఎస్ఐ ఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ అధికారి పి కృష్ణ ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎం శ్యాంసుందర్, ఇంచార్జ రెవెన్యూ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ ఈ వసంత్ లు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల