Land Survey: మంచిర్యాల జిల్లా మందమర్రి (వి)ఊర చెరువు శిఖం పరిధిలో భూములను ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు శుక్రవారం సమగ్ర సర్వే నిర్వహించారు. ఇటీవల కాలంలో చెరువు భూమి కబ్జాలపై, అక్రమాలపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదిక ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన చెరువు శిఖం భూమి సమగ్ర సర్వే పట్టణ జనాభా వ్యాప్తంగా చర్చనీయమైంది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారి రమ్య మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చెరువు శిఖం పరిధిలో ఉన్న భూములు, ఎఫ్టిఎల్, బఫర్ జోన్ హద్దుల కొలతలపై సర్వే నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం పూర్తి సమగ్ర సర్వే చేపడుతున్నామని, సర్వే పూర్తయిన తర్వాత నివేదిక రెవెన్యూ అధికారులకు అందజేస్తామన్నారు. రెవెన్యూ అధికారి ఆర్ఐ గణపతి రాథోడ్ మాట్లాడుతూ, సర్వే కొనసాగుతుందని, సర్వేలో పూర్తి నిజాలను వెలికి తీసి, జిల్లా పాలన అధికారికి నివేదిక అందజేస్తామన్నారు. శనివారం పూర్తిస్థాయిలో సర్వే ఉంటుందని తెలిపారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల