నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తా
పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వీ నరేందర్ రెడ్డి
Alphores Narender Reddy: డబ్బులు,ఆస్తులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రావడం లేదని రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా నిలువడానికి సేవకుడుగా పని చేసేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నానని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని నార్తిన్ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 34 సంవత్సరాలుగా విద్యారంగంలో సేవలు అందించానని తెలిపారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు తప్పకుండా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ నెల 30 నుంచి నెల రోజుల పాటు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 2021 కి ముందు గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు అర్హులు అని అన్నారు. ఇప్పటికీ హెచ్ఎం లు పదోన్నతులు లేక 18 ఏళ్లుగా హెచ్ ఎం లుగా ఉన్నారని, మండల విద్యా అధికారుల ఖాళీలు భర్తీ చేయక పోవడంతో సమస్య మరింత జటిలం అయిందని అన్నారు.1998 నాటి డిఎస్సీ అభ్యర్థులు నన్ను కలవడం జరిగిందని, ఇంకో 3 ఏళ్లు దాటితే వయోపరిమితి దాటి అనర్హులుగా మిగిలి పోవలసి వస్తుందని వాపోయారని అన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాద్యాయులు వేతనాలు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మంచిర్యాల పట్టణంలో ఉన్న కోర్టు భవనం సైతం ఇంకా అద్దె భవనాల్లో కొనసాగడం దూరదృష్ట కరణమన్నారు. ఇప్పటివరకు చాలా మంది నాయకులు రాజకీయ భవిష్యత్తు కోసం పనిచేశారని, కాని నేను మాత్రం ఒక సేవకుడుగా పనిచేస్తానని పట్ట భద్రులకు భరోసా ఇచ్చారు. నన్ను అందరించండి మీ అండగా నేనూంటని అని అన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల