Highest interest rates on Fd
Highest interest rates on Fd

Highest interest rates on Fd : ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల సవరింపు.. ఏ బ్యాంకు బెటరో తెలుసుకోండి

Highest interest rates on Fd : జూలై 1 నుండి, చాలా బ్యాంకులు ఎఫ్‌డీ(FD)పై వడ్డీ రేట్లను మార్చాయి. రూ.3 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లలో మార్పులు జరిగాయి.  పెట్టుబడుల్లో షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో వంటి తర్వాత కూడా ఎఫ్‌డీలపై ప్రాధాన్యం తగ్గలేదు. నేటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు ఎఫ్‌డీలలో పెట్టుబడి పెడుతున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి ఏ బ్యాంకుల ఎఫ్‌డీ రేట్లు ఎలా మారాయో తెలుసుకుందాం.

యాక్సిస్ బ్యాంక్‌లో ఎఫ్‌డీలపై రేట్లు
యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను జూలై 1 నుంచి మార్చింది. 5 సంవత్సరాల నుంచి పదేళ్ల వరకు ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 7.75 శాతం అందిస్తోంది. సాధారణ పౌరులు 17 నెలల నుండి 18 నెలల కంటే తక్కువ కాల వ్యవధి గల ఎఫ్‌డీలపై 7.2 శాతం వడ్డీ రేటును పొందుతున్నారు.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 12 నెలల ఎఫ్‌డీలపై పై అత్యధికంగా 8.75 శాతం వడ్డీ రేటును అందిస్తున్నది. సాధారణ పౌరులకు 12 నెలల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 8.25 శాతం. ఇస్తున్నది.

ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు
ఐసీఐసీఐ బ్యాంక్ 15 నెలల నుండి 18 నెలల కంటే తక్కువ ఎఫ్‌డీ కాలానికి సీనియర్ సిటిజన్‌లకు అత్యధిక రేటు 7.75 శాతం అందిస్తోంది. సాధారణ పౌరులకు అత్యధిక ఎఫ్‌డీ రేటు 15 నెలల నుంచి రెండేళ్లకు పైబడి ఎఫ్‌డీలపై 7.2 శాతంగా ఉంది.

పంజాబ్ – సింధ్ బ్యాంక్ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 666 రోజులఎఫ్‌డీలపై అత్యధికంగా 7.80 శాతం వడ్డీని అందిస్తోంది. సాధారణ పౌరులకు ఈ ఎఫ్‌డీపై 7.3 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీలపై వడ్డీ రేటు
బ్యాంక్ ఆఫ్ ఇండియా 666 రోజుల FDపై సీనియర్ సిటిజన్‌లకు అత్యధికంగా 7.80 శాతం FD రేటును అందిస్తోంది. ఈ FDలో సాధారణ పౌరులకు 7.3 శాతం రేటును ఆఫర్ చేస్తున్నారు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *