శెనార్తి మీడియా, మంచిర్యాల :
Bellampalli ACP: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్(Ravi Kumar) అన్నారు. వీటి వినియోగంతో కలిగే అనర్థాలపై అవగాహన (Awarness) పెంచుకోవాలని చెప్పారు. శనివారం బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, యాంటీ ర్యా గింగ్ పై తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. విద్యార్థులు సిగరెట్, గుట్కా, గంజాయి, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలన్నారు. వీటికి ఆకర్షితులై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. పట్టణంలో ఎవరైనా గంజాయి అమ్మినా, పీల్చినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇటీవల విడుదలైన కొత్త చట్టాలపై విద్యార్థులు మరింత అవగాహన పెంచుకొని క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ దేవయ్య, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, బెల్లంపల్లి ఒకటో ఠాణా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.