Chandra Babu and Narendra Modi : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రలుండరు అనే సామెతను మరోసారి నిజం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 2018లో బీజేపీని వీడి కాంగ్రెస్ పంచన చేరిన విషయం తెలిసిందే. కానీ కాంగ్రెస్ తో టీడీపీ జత కట్టడాన్ని సగటు తెలుగు కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఫలితం 2019 లో టీడీపీకి ఘోర పరాభం. 23 సీట్లకు టీడీపీ పరిమితమైంది. అదే సమయలో కాంగ్రెస్ కూటమికి పరాభవం తప్పలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఎవరి మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగల బంపర్ మెజార్టీని బీజేపీ ఆ ఎన్నికల్లో సాధించింది. బీజేపీని వీడడం టీడీపీకి కొత్తేమీ కాదు. 2009 ఎన్నికల్లోనూ బీజేపీకి దూరంగా ఉన్నాడు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో బాబుకు ఓటమి తప్పలేదు. కానీ 2014 ఎన్నికలకు వచ్చేసరికి మళ్లీ బీజేపీకి దగ్గరై విభజిత ఆంధ్రప్రదేశ్ లో తొలిముఖ్యమంత్రి అయ్యాడు బాబు.
ఇదంతా అందరికీ తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కారణం చూపి 2018లో బీజేపీని విభేధించిన చంద్రబాబు అప్పుడు చేసిన రాద్ధాంతం అంతా ఇంతాకాదు. ఏకంగా ప్రధాని మోదీపై బాబు చేసిన వ్యాఖ్యలు దేశంలో ఏ నాయకుడు చేయలేదు. పెళ్లాన్ని వదిలినోడికి కుటుంబం గురించి, దేశం గురించి ఏం ఆలోచిస్తాడంటూ పరుష పదజాలంతో దూషించాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతికి వస్తే, షా కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఇది బాబే చేయించాడని బీజేపీతో పాటు ఇతర పార్టీల నాయకులు ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి అండ లేకుండా కేంద్ర హోం మంత్రి పై కాన్వాయ్ జరగదని అందరికీ తెలుసు. ఇది బహిరంగ రహస్యమే.
కానీ కాలం తిరగబడింది. 2019 ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం, అదే ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం. ఇక అక్కడ నుంచి మొదలయ్యాయి చంద్రబాబుకు కష్టాలు. వైసీపీ ప్రభుత్వం బాబను ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా చేసింది. ఇక తనకు మోడీయే దిక్కని భావించిన బాబు బీజేపీతో జత కట్టడానికి చేయని ప్రయత్నం లేదు. చివరకు పవన్ కల్యాణ్ చొరవతో బీజేపీ టీడీపీతో జత కట్టింది. ఫలితం బంపర్ మెజార్టీతో విజయం.
మళ్లీ అదే సందేహం
ఈసారి తిరుగులేని మెజార్టీతో విజయం సాధించిన చంద్రబాబు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటులో కీలకం అయ్యాడు. బీజేపీ సొంతంగా మ్యాజిక్ దాటకకపోవడం. ఎన్డీఏ కూటమిలోని జేడీయూ, టీడీపీకి మెరుగైన స్థానాలు రావడంతో సందేహాలు మొదలయ్యాయి. ఇద్దరూ అవసరాన్ని బట్టి దాటవేత నేతలే. రాజకీయాల్లో సహజమే అయినా అందరి చూపు బాబు పైనే పడింది. బాబు ఎప్పుడు ఎటు మారుతాడో అని జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తూనే ఉన్నది. కానీ చంద్రబాబు తాను ఎన్డీఏతోనే ఉన్నాయని ఇవన్నీ సందేహాలు ఎందుకంటూ జాతీయ మీడియాకు ఎదురు ప్రశ్నలు వేశాడు. ఇక శుక్రవారం జరిగిన పార్లమెంట్ నేత ఎంపిక సమయలో మోడీని కీర్తించాడు బాబు.
ప్రధానిగా మోడీయే కరెక్ట్
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 10 ఏళ్లలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని బాబు ప్రశంసించారు. మోదీ దేశాన్ని గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చారని కొనియాడారు. తాను గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని, మోదీ ప్రపంచ స్థాయిలో దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని ప్రశంసలు కురిపించారు. నేడు భారతదేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు మోడీ రూపంలో ఉన్నాడని చెప్పారు. భారతదేశానికి ఇది గొప్ప అవకాశం, ఈ అవకాశం మళ్లీ రాదు. రానున్న రోజుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతుదందన్నారు.. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మోడీ పేరును తాను సమర్థిస్తున్నానని చెప్పారు.