Fat Burn With Yoga : బరువు తగ్గడానికి అదనపు కేలరీలను కరిగించాల్సిందే. దీని కోసం పలువురు జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేస్తుంటారు. అయితే యోగా తో కూడా కేలరీలు తగ్గించు కోవచ్చా అన్న ప్రశ్నలు చాలా మందిలో మెదులుతుంటాయి. ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం
పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం యువత జిమ్‌కు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నది. బరువు తగ్గాలంటే జిమ్‌కి వెళ్లడం ఉత్తమమని పలువురు భావిస్తుంటారు. అక్కడ పలు ఎక్సర్ సైజ్ లతో కేలరీలు కరిగించవచ్చని భావిస్తుంటారు. బరువును కూడా నియంత్రించవచ్చు. చాలా మంది తాము తీసుకునే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో సరిచూసుకుని భోజనం చేస్తుంటారు. అలాగే అదనపు క్యాలరీలను కరిగించుకోవడానికి జిమ్‌కి వెళ్లి వర్కవుట్ చేస్తుంటారు. కానీ చాలా మంది వారి బిజీ షెడ్యూల్ కారణంగా జిమ్‌కి వెళ్లడానికి సమయం ఉండదు. జిమ్‌కి వెళ్లడం వల్ల కేలరీలు కరిగిపోతాయా అనే ప్రశ్న వారి మనస్సులో వస్తుంది.
శారీరకంగా చురుకుగా ఉండటం, వ్యాయామం చేయడం ద్వారా కేలరీలను కూడా తగ్గించవచ్చు. కానీ యోగా కేలరీలను తగ్గించడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బిజీ షెడ్యూల్ కారణంగా జిమ్‌కి వెళ్లలేని వారు డెస్క్ వర్క్ చేయడం, కాస్త సమయం కేటాయించి యోగా చేయడం వంటివి చేస్తే క్యాలరీలను కరిగించడంలో కూడా సహాయపడుతుంది.
యోగా కేలరీలను కరిగిస్తుందా?
25 నిమిషాల పాటు సూర్య నమస్కారం చేయడం వల్ల 300 కేలరీలు కరుగుతాయని ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ట్రెడ్‌మిల్‌పై 30 నిమిషాల పాటు పరుగెత్తడం ద్వారా దాదాపు 290 కేలరీలు కరిగిపోతాయి. అదేవిధంగా, ప్రతిరోజూ కేవలం 5 నిమిషాలు కొన్ని ఆసనాలు చేయడం ద్వారా కూడా 50 కేలరీలు కరిగించుకోచ్చు. 10 నిమిషాలు వెయిట్ లిఫ్టింగ్ చేయడం ద్వారా దాదాపు 35 కేలరీలు కరిగించుకోవచ్చు. ఒక్కొక్కటి 15-15 సెకన్లలో 5 సార్లు చక్రాసనం చేయడం ద్వారా, 100 కేలరీలు కరిగించుకోవచ్చు. అయితే 5 నిమిషాల పాటు పుషప్స్ చేసినా 35 కేలరీలు కరుగుతాయి.
25 నుండి 30 నిమిషాలు యోగా చేస్తే, శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా చురుగ్గా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గించడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, కోపాన్ని నియంత్రించడం, రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు దరిచేరకుండా కాపాడుకోచ్చు. దీని కోసం యోగా నిపుణుడిని సంప్రదించి తమకేం కావాలో వివరించాలి. యోగా శిక్షకులు సూచించిన ఆసనాలను సరైన క్రమపద్ధతిలో చేయాలి.
బిజీ షెడ్యూల్ కారణంగా జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడానికి సమయం లేనివారు నిపుణుల సలహాలను పాటించడం మేలు. యోగా చేసే టెక్నిక్‌ని అనుసరించడం ద్వారా ఇంట్లో కేలరీలను తగ్గించుకోవచ్చు.