Singer Palak Muchhal: సినీరంగంలో రాణిస్తున్న పలువురు ప్రముఖులు తమ వంతుగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. టాలీవుడ్ లో మహేష్ బాబు ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు తన ఉదార స్వభావాన్ని చాటుకుంటున్నారు. మరో టాప్ హీరో నందమూరి బాలకృష్ణ తన తల్లి పేరిట ఏర్పాటు చేసిన బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సాయం అందిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి అయితే ప్రత్యేంగా చెప్పక్కర్లేదు. దాదాపు 25 ఏళ్ల క్రితమే రక్తదానంపై చైతన్యం పెంపొందించారు. ఆపద సమయాల్లో రక్తదానం చేసేలా ప్రోత్సహించడంతో పాటు తన అభిమానుల ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ లోనూ పలువురు స్టార్ హీరోలు, టెక్నీషికయన్లు తమవంతుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
ప్రాణభిక్ష పెడతున్న సింగర్
ఈ జాబితాలోకి బాలీవుడ్ సెలబ్రిటీ పేరు కూడా చేరింది. ‘కౌన్ తుజే’, ‘ఓ ఖుదా’, ‘మేరీ ఆషికి’, ‘సనమ్’ ‘ఏక్ ములకత్’ వంటి సూపర్ హిట్ పాటలకు గాత్రం అందించారు పాలక్ ముచ్చల్. ప్లేబ్యాక్ సింగర్‌గానే కాకుండా, సామాజిక సేవలో కూడా పాలక్ ముచ్చల్ ముందున్నారు. రెండున్నర సంవత్సరాల వయస్సులో పాటలు పాడటం మొదలుపెట్టింది. అంతే కాదు ఇప్పటి వరకు 3 వేల మంది చిన్నారుల ప్రాణాలను కాపాడింది పాలక్ . వీరంతా గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులు వీరే.
ఇటీవల మరొకరు.
పాలక్ ఇటీవల మరో చిన్నారికి శస్త్రచికిత్స చేయించారు. అతని పేరు అలోక్. అలోక్ శస్త్రచికిత్స విజయవంతమైంది. అతను కోలుకుంటున్నాడు. ఇప్పటి వరకు అలోక్‌తో కలిపి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు చేయించిన శస్ర్త చికిత్సల సంఖ్య మూడు వేలకు చేరుకుంది. ఇంత గొప్ప కార్యాన్ని తన బాధ్యతగా భావిస్తున్న గాయనిపై ఇండస్ర్టీ ప్రశంసలు కురిపిస్తున్నది. సామాజిక సేవ లో పాలక్ పేరు ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’, ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో కూడా నమోదైంది.
ఒక చిన్న అమ్మాయితో ప్రారంభం
గుండె సమస్యలు ఉన్న పిల్లలకు చికిత్స చేయిస్తున్నానని, ఇప్పటివరకు 3000 సర్జరీలు చేయించానని పాలక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంకా మరో 400 మంది పిల్లలకు చికిత్స చేయించాల్సి ఉందని చెప్పారు. ఒక చిన్న అమ్మాయితో ప్రారంభించిన ఈ కార్యం ఇప్పుడు ఈ 3000 మందికి చేరింది. వారంతా తన కుటుంబం లాంటివారని చెప్పుకొచ్చింది పాలక .
వీడియో షేర్ చేసిన సింగర్
పాలక్ ముచ్చల్ అలోక్ ఉన్న వీడియోను షేర్ చేశారు. 8 ఏళ్ల చిన్నారితో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు,. ఆ బాలుడి పేరు అలోక్ సాహు. అతను ఇండోర్ నివాసి. ఇటీవలే అలోక్‌కు గుండె శస్త్రచికిత్స జరిగింది. అది విజయవంతమైంది కూడా. ఈ వీడియోలో పాలక్ మాట్లాడుతూ శస్త్రచికిత్స విజయవంతమై ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకుంటున్నాడు.అని పేర్కొన్నారు. ఈ వీడియో తర్వాత, పాలక్ చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది.