New Ration Cards

New Ration Cards: త్వరలో రేషన్ కార్డులు

  • విధివిధానాల ఖరారుకు సబ్ కమిటీ ఏర్పాటు
  • నెల రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని నిర్ణయం
  • దశాబ్ద కాలం నిరీక్షణకు ఎట్టకేలకు తెర
  • పెండింగ్లో లక్షలాది దరఖాస్తులు
  • అర్హులకు మొండిచేయి చూపిన బీఆర్ఎస్

శెనార్తి మీడియా, మంచిర్యాల

New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న వారికి రాష్ర్ట ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న వారికి ఉప శమనం లభించనున్నది. ఇన్నేళ్లుగా ఎదురుచూసిన పేదల కల త్వరలో నెరవేరబోతున్నది. గత బీఆర్ ఎస్ పాలనలో వారికి రిక్తహస్తమే ఎదురైంది. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులపై నిరీక్షణకు తెరదించింది. త్వరలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందించాలని మంత్రి వర్గ సమావేశం ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. నెలలోగా రేషన్ కార్డుల జారీ, విధివిధానాలపై మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్నా పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన న్యాయం చేస్తున్నదని ధీమా వ్యక్తం చేశారు.

పదేళ్లుగా మోక్షం కరువు..
తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల కాలంలో రేషన్ కార్డులకు మోక్షం లేకుండా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని అసలు పట్టించుకోలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినా పదేళ్ల పరిపాలన కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పించలేకపోయింది. రేషన్ కోసం పేదలు నానా ఇబ్బందులు పడ్డారు. అధికారులు,
ప్రజా ప్రతినిధుల ప్రజల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కనీసం రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు. దీంతో పేదలు వచ్చే రేషన్ సరుకులు సరిపోక నానా ఇబ్బందు లు పడ్డారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రేషన్ కార్డుల కోసం జిల్లాలో లక్షలాది దర ఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయి. బీఆర్ఎస్ పాలన నుంచి ఇప్పటివర కు దరఖాస్తులు భారీగా పేరుకుపోయాయి.

కాంగ్రెస్ తీపి కబురు..
తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు తీపి కబురు అందించింది. త్వరలోనే పేదలకు రేషన్ కార్డులు అందిస్తామని ప్రకటించింది. గురువారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమా వేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రవాణా బీచ్ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు. అందులో ముఖ్యమైనది ఒకటి రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ. రేషన్ కార్డుల జారీకి విధివిధానాల రూపకల్పనకు రాష్ట్ర నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చైర్మన్, సభ్యులుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
శ్రీనివాస్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను నియమించారు. నెల రోజుల్లో విధి విధానాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘాన్ని ఆదేశించారు. నివేదిక అనంతరం రేషన్ కార్డులు పేదలకు అందించను న్నారు. ఈ మేరకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నది. దశబ్ద కాలంగా ఎదురుచూసిన పేద ప్రజల కల సాకారం కానుంది. ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న అంశానికి మోక్షం కలుగనుంది. దీంతో పేదలు ఆనందపడుతున్నారు.

మంచిర్యాల జిల్లాలో 2లక్షల 19 వేల 158 మంది రేషన్ సరుకులు పొందే లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతం తాజాది. రేషన్ కార్డులు ఏఎఫ్ఎస్సి- 15,412, ఎఫ్ఎస్సి- 2లక్షల 3వేల 587, ఏఏపి -159 తో కలిపి అన్ని రకాల రేషన్ కార్డులు 2లక్షల 19వేల 158 ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల్లో 423 రేషన్ షాప్ లు ఉన్నాయి. 2,19,158 కార్డులకు ద్వారా 6 లక్షల 58వేల 421 మంది లబ్ది పొదుతున్నారు. కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ తో లబ్దిదారుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దరఖాస్తులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఇచ్చిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం వేగవంతం కానుంది.

బీఆర్ఎస్ పాలన కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వ్యవహరించిన కాలంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఆ తర్వాత రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆటకెక్కింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తాజాగా మంత్రివర్గం రేషన్ కార్డుల పంపిణీకి నిర్ణయం తీసుకోవడంతో పేదల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా స్పందించిందని వారు అభిప్రాయపడుతున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *