Sucide Attempt :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.తనపై అక్రమ కేసులు పెట్టారంటూ నస్పూర్ మున్సిపాలిటీ 21వ వార్డు కౌన్సిలర్ బేర సత్యనారాయణ సర్జరీ బ్లేడ్ తో మెడ కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు వెంటనే అడ్డుకొని అతడిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సీసీసీ నస్పూర్ మున్సిపాలిటీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించాడని, దూషించాడని మున్సిపల్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో బేర సత్యనారాయణ పై అట్రాసిటీ కేసు నమోదు అయినట్లు సమాచారం. తన తండ్రిపై కావాలని కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన కూతురు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం బేర సత్యనారాయణ ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
-శెనార్తి మీడియా, మంచిర్యాల