బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Anil Jadhav: పంట రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తే వారిపై ప్రభుత్వం కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం సరైంది కాదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో రైతులు సీఎం శవయాత్ర చేపట్టగా 11 మంది రైతులపై కేసులు పెట్టడంతో వారిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమాయక రైతుల మీద కేసులు పెట్టడం సరికాదన్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే సంపూర్ణ రుణమాఫీ చేసి రైతులతో పాలాభిషేకం చేసుకోవాలని హితవు పలికారు. కనీసం 40% మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. పట్టా పాస్ బుక్ ప్రామాణికంగా రుణ మాఫీ చేయాలి కానీ కుటుంబానికి రూ. 2 లక్షలు అని చెప్పి ఇంకా లక్ష ఇరవై వేలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు . శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఈ ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని ఖండించారు.
శెనార్తి మీడియా, తలమడుగు