Chiranjeevi and Jagan Meeting : పాలక పక్షాలకు వ్యతిరేకంగా ఏదైనా సినిమాలో సీన్లు, డైలాగులు ఉంటే వాటిని సెన్సార్ బోర్డు ద్వారా తొలగించడం తెలిసిందే. కానీ పాలకులెప్పుడు సినీ పరిశ్రమపై కక్ష గట్టలేదు. తమకు వ్యతిరేకంగా సినిమాలు తీసినా, పాటలు రాసినా పాలకులెప్పుడూ కళాకారులపై పగతీర్చుకోలేదు. దేశంలో ఏ సీఎం సినీపరిశ్రమపై పగబట్టలేదు. కానీ మొన్నటి వరకు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మాత్రం తనకు ఏ మాత్రం అడ్డుగా లేని సినీ పరిశ్రమపై తెలియని పగపెంచకున్నాడు. ఎందుకంటే తాను సీఎంగా పదవి చేపట్టినా సినీ పరిశ్రమ నుంచి తనకు ఒక్కరూ కూడా శుభాకాంక్షలు చెప్పలేదని, కనీసం సోషల్ మీడియా లో కూడా విష్ చేయలేదని తనలోని అహం దెబ్బతిన్నది. ఒక రాష్ర్టానికి సీఎం అయిన తనను కలవకపోవడమా? అనే అహం జగన్ లో పెరిగిపోయింది. ఇంకేముంది తను అనుకున్న సమయం రానే వచ్చింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు కరోనా తగ్గముఖం పడుతున్న సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తన మంత్రి వర్గంలోని కొందరిని సిని పరిశ్రమపైకి వదిలాడు. ఇంకేముంది సాక్షాత్తూ ముఖ్యమంత్రే తమను ఉసిగొల్పడంతో ఆ మంత్రులు ఊరుకుంటారా? తన అధినేత చల్లని చూపు కోసం సినీ పరిశ్రమపై ఆంక్షలు విధిస్తూ రావడం మొదలు పెట్టారు.
ముందుగా ఫుల్ కెపాసిటి వద్దని.. ఆ తర్వాత రేట్లు పెంచొద్దని
అప్పుడప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్నది. జనాలు తమ పనులకు వెళ్తున్నారు. దాదాపు ఏడాది పాటు మూత పడ్డ థియేటర్లు తెరుచుకున్నా పూర్తిస్థాయిలో సీట్లు నింపడానికి అప్పటి జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అదే సమయంలో స్టార్ హీరోలు బాలకృష్ణ, అల్లు అర్జున్ అఖండ, పుష్ప సినిమాలకు టికెట్ల రేట్ల పెంచడానికి అనుమతి ఇవ్వలేదు. అయినా సినిమా మీద నమ్మకంతో వారు రిలీజ్ చేసుకున్నారు. ఎలాగూ టికెట్ రేట్లు పెంపునకు అనుమతి ఇవ్వకున్నా పూర్తి సీట్లు నింపేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఇక అప్పుడు రిలీజ్ చేయాలనుకున్నా పెద్ద సినిమాలు విడుదల సందిగ్ధంలో పడ్డాయి. అప్పటికే రిలీజ్ కావాల్సిన ప్రభాస్ రాధేశ్యామ్, ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా వేసుకోక తప్పలేదు. దేశంలోని ఏ రాష్ర్ట ప్రభుత్వం కూడా సినిమా పరిశ్రమకు అభ్యంతరాలు చెప్పలేదు. కానీ అప్పటి ఏపీ సీఎం జగన్ మాత్రమే సినీ పరిశ్రమపై కక్ష సాధింపు ధోరణితో రాక్షసానందం పొందాడు.
తెలుగు సినీ పరిశ్రమ పెద్ద కొడుకుగా జగన్ వద్దకు చిరంజీవి
అప్పటికే దెబ్బతిన్న పరిశ్రమను కాపాడేందుకు చొరవ తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇతర స్టార్ హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్లతో కలిసి తాడేపల్లి గూడెంలోని క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ ను కలిశారు. చేతులు జోడించి సినీ పరిశ్రమకు మినహాయింపులు ఇవ్వాలని రెండు చేతులు జోడించి వేడుకున్నాడు. అప్పటికీ జగన్ లోని రాక్షసుడు సంతృప్తి చెందలేదు. కానీ ఏదో కానివ్వు అన్నట్లుగా కొన్ని సినిమాలకు మినహాయింపులు ఇచ్చి మళ్లీ మొదటికి వచ్చాడు. తన మంత్రుల్లోని ఒకరిద్దరితో యథావిధిగా మళ్లీ పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో అడ్డుతగులుకుంటూ వచ్చాడు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్
మెగాస్టార్ చిరంజీవి లాంటి చేతులు జోడించిన విజువల్స్ బయటికి వస్తే వైసీపీ సోషల్ మీడియా ఊరకుంటుందా. కుక్కకు బొక్క దొరికినట్లు చిరంజీవి చేతులు జోడించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ రాక్షసానందం పొందింది. కానీ చిరంజీవి అభిమానులే కాదు సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు ఆ దృశ్యాన్ని జీర్ణించుకోలేకపోయాడు. వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న సినీ పరిశ్రమను కాపాడేందుకు మెగాస్టార్ ముందుకు వస్తే.. వైసీపీ సోషల్ మీడియా మాత్రం బెగ్గింగ్ చిరంజీవి అంటూ పోస్టులు పెట్టింది. ఇలా కళాకారులను అవమానించి న జగన్ గతి ఏమైంది.. రోజులు గడిచాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా పొందలేని దుస్థితికి దిగజారిపోయింది.
గాయపడిన తమ్ముడి గుండె..గర్జించింది..
తన అన్న మెగాస్టార్ చిరంజీవి జగన్ ను ప్రాధేయపడిన తీరుతో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ గుండెను గాయపర్చింది. తన సినిమాలతో ఎంతో మందిని అలరించిన మెగాస్టార్ తన కోసం కాకుండా ఎంతో మంది కోసం అడుగు ముందుకు వేస్తే ఒక సీఎం వ్యవహరించిన తీరుపై ఆవేదన చెందాడు. ఇక వైసీపీ సోషల్ మీడియా వ్యవహరించిన తీరు మరీ దయనీయం. ఇక పవన్ జగన్ పై యుద్ధం మొదలు పెట్టాడు. అథ:పాతాళానికి తొక్కేస్తానని మొన్నటి ఎన్నికల ప్రచారంలో సీఎంపై గర్జించాడు. గద్దె దించుతానని శపథం పూనాడు.
బ్రో సినిమాతో మళ్లీ మొదలు..
పవన్ గెస్ట్ రోల్ లో వచ్చిన బ్రో సినిమాతో జగన్ ప్రభుత్వానికి, పవన్ మధ్య యుద్ధంమళ్లీ మొదలైంది. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన యుద్దం వారాహి యాత్రతో పతాక స్థాయికి చేరింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ సఫలమయ్యాడు పవన్. మొత్తానికి ప్రతిపక్ష హోదా లేకుండా పోయాడు జగన్. చెప్పుడు మాటలో.. తప్పుడు నిర్ణయాలో గానీ కళాకారుల కష్టాలకు కారణమైన జగన్ కాలక్రమంలో అథ: పాతాళానికి పోయాడు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ముందుకెళ్లిన మంత్రులు సైతం మొన్నటి ఎన్నికల్లో మట్టి కరిచారు.