- సీజ్ చేసిన ఇసుక తరలింపులో నెంబర్ లేని వాహనాలు
- ఇంజన్ ఏదైనా సరే.. డబ్బా నెంబరు మాత్రమే చూస్తున్నారు
- ఓవైపు సీజ్ చేసిన ఇసుక సైతం మాయం చేస్తున్న ఇసుకాసురులు
Sand smuggling: కలెక్టరేట్‌కు సమీపాన ఉన్న సీతారాం పల్లి, తాళ్లపల్లి గ్రామాల శివారు వ్యవసాయ భూముల్లో, వెంచర్లలో పెద్ద మొత్తంలో ఇసుక డంపులున్నా మామూళ్లకు అలవాటు పడిన అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరంగా మారాయి. పెద్ద సంఖ్యలో అక్రమ నిలువలుండగా ఫొటోలకు ఫోజులిచ్చి కొన్నింటిని చూపి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు సక్రమం పేరిట సీజ్ చేసిన కుప్పలకు ఆన్‌లైన్ పేరిట ఇసుక తరలిస్తున్నామంటూ సీజ్ చేయని కుప్పలను సైతం తరలిస్తున్నారు. బుధవారం ఆన్‌లైన్‌లో ఆరు ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణాకు అనుమతులు ఇచ్చిన అధికారులు అందులో ఓ నెంబర్ ప్లేట్‌లేని వాహనం నడుస్తున్నా నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరించడపై పలు అనుమానాలకు తావు తీస్తోంది.
అసలు మైనింగ్ అధికారి కార్యాలయంలో సిబ్బందిలో ఎస్ఆర్వో, ఎస్ఆర్ఏ (శాండ్ రీచ్ ఆఫీసర్, శాండ్ రీచ్ అసిస్టెంట్)లు ఉంటే, వీరిలో కొందరు చేస్తున్న చేతి వాటమా..? లేక ఎవరు ఎం చేస్తారులే.. అన్న అహంకారమా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీజ్ చేసిన ఇసుక తరలింపులో గోల్‌మాల్ ఎలా జరుగుతుందో అధికారికి తెలుసా..? లేక అధికారులు వీరితో చేపిస్తున్నారా..? అని తెలియాల్సిన అవసరం ఎంత అయినా ఉంది.
సీజ్ చేసిన ఇసుక మాయం
సీతారాంపల్లి, తాళ్లపల్లి గ్రామ శివారులో 135 ట్రిప్పుల ఇసుకను సీజ్ చేశామని రెవెన్యూ, మైనింగ్ అధికారులు. రాత్రికిరాత్రే కొందరు ఇసుక మాఫియా కేట్టుగాళ్లు వారి కళ్లు కప్పి సీజ్ చేసిన దాన్నే తరలించుకుపోవడంపై ఎన్నో అనుమానాలకు దారి తీసుస్తోంది. సీజ్ చేసిన ఇసుక రవాణా అవుతుంటే అధికారులకు కనిపించలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మొత్తం అయ్యేదాకా చెప్పను
నస్పూర్ మండలం సీతారాంపల్లి, తాళ్లపల్లి గ్రామ శివారులో ఉన్న అక్రమ నిలువలు గుర్తించి ఇటీవల సీజ్ చేసిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు. సీజ్ చేసిన ఇసుక రవాణాకు గురువారం ఆరు ట్రాక్టర్ల ద్వారా అనుమతులు ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై వివరణ కోరగా ‘శెనార్తి మీడియా’ మైనింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లగా అక్కడ అధికారి లేకపోవడంతో ఫోన్ ద్వారా వివరణ అడిగితే సీజ్ చేసిన ఇసుక మొత్తం రవాణా అయిన తర్వాతే చెబుతానని చెప్పడం గమనార్హం.
ఆంతర్యం ఏమిటి…?
‘శెనార్తి మీడియా’ అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పకపోవడం వెనుక ఆంతర్యం ఏముందని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎస్ఆర్ఓ, ఎస్ఆర్ఏల వెనుక ఉన్నది ఏడీనా అనే పలువురు చర్చించుకోవడం గమనార్హం.
శెనార్తి మీడియా, మంచిర్యాల: