mncl

August 15 : ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

August 15 : మంచిర్యాల జిల్లా జిల్లా నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గురువారం నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ పతాకావిష్కరణ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు.. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ రావు మాట్లాడుతూ.. భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ జిల్లాలో నిర్వహిస్తున్న 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజాప్రతినిధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, పుర ప్రముఖులకు, అధికారులకు, ఉద్యోగులకు, విద్యార్థినీ, విద్యార్థులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎందరో మహానుభావుల కృషి, పోరాటం, అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగా 1947వ సంవత్సరంలో స్వాతంత్య్రం సాధించుకున్నాము. స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకిక రాజ్యం, శాంతి, అహింసల ప్రాతిపదికపై లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాము. మన దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నానని తెలిపారు. సుధీర్ఘ పోరాటాల ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు, అభిప్రాయాలకు దక్కిన అపురూప కానుక మంచిర్యాల ప్రత్యేక జిల్లా ఏర్పాటుతో, ప్రజలకు ప్రభుత్వ సేవలు నేరుగా అందించేందుకు పరిపాలన సౌలభ్యం కొరకు ప్రభుత్వ అధికారులు నిరంతరం జిల్లాలో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలను పర్యవేక్షిస్తూ అభివృద్దిలో జిల్లాను ముందుకు తీసుకెళుతున్నారు.

సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే లక్ష్యంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యచరణలో భాగంగా 6 గ్యారంటీలలోని మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంలో జిల్లాలో ఇప్పటి వరకు 86 లక్షల 32 వేల మంది మహిళలు లబ్ది పొందారు. ఈ పథకంతో నిత్యం ప్రయాణించే మహిళలకు సగటున ఒక నెలకు 4 వేల రూపాయల నుండి 5 వేల రూపాయల వరకు ఆదా అవుతుంది. అర్హులైన లబ్దిదారులకు 500 రూపాయలకే రాయితీ సిలిండర్ అందించడం జరుగుచున్నది. మహిళలకు ప్రతి నెల 2 వేల 500 రూపాయలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6వ తేదీ వరకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో 2 లక్షల 58 వేల 213 దరఖాస్తులు స్వీకరించి వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయబడినవి. ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అర్హులకు సంక్షేమ పథకాల ఫలాలు అందించడం జరుగుచున్నది.

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 1 వేయి 672 ప్యాకేజీల సేవలతో నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక రక్షణ అందించడం జరుగుచున్నది. నగదు రహిత చికిత్స, రోగికి ఉచిత ఆహారం, రవాణా చార్జీలు చెల్లించడంతో పాటు 126 రకాల చికిత్సలకు ఒక సంవత్సర కాలం ఉచితంగా మందులు అందించడం జరుగుచున్నది. డిసెంబర్-2023 నుండి జూలై-2024 వరకు జిల్లాకు చెందిన ప్రజలకు 9 వేల 382 శస్త్రచికిత్సలకు గాను 18 కోట్ల 55 లక్షల రూపాయల విలువ గల వైద్యం అందించడం జరిగినది. గృహజ్యోతి పథకం క్రింద అర్హత గల లబ్దిదారుల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడంలో భాగంగా మార్చ్ నుండి జూలై వరకు 19 కోట్ల 17 లక్షల రూపాయల రాయితీ ఇవ్వడం జరిగినది. విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లాలో సింగరేణి కంపెనీలు, రోడ్డు, రైలు, రవాణా వ్యవస్థ, జిల్లాలో గల నీటిపారుదల వనరులు జిల్లా అభివృద్ధిలో ప్రత్యేక భూమిక పోషిస్తున్నాయి.

జిల్లాలో గల ఎల్లంపల్లి జలాశయం, కవ్వాల్ అభయారణ్యం, గాంధారి ఖిల్లా, గాంధారి వనం ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి పరుచనున్నాం. జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికార యంత్రాంగానికి, ప్రజలకు సేవ చేస్తూ ఎల్లవేళలా శాంతి భద్రతలను సంరక్షిస్తున్న పోలీస్ శాఖ వారికి, జిల్లాకు సంబంధించిన వార్తలను నిరంతరం ప్రజలకు చేరవేస్తున్న సమాచార శాఖ సిబ్బందికి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, జిల్లా అభివృద్ధిలో భాగం పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా అభివృద్ది పునరంకితం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, డి.సి.పి. భాస్కర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్, పోలీసు శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *